ఉత్తమ కవి, కథకుడు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత దాట్ల దేవదానంరాజు. దక్షిణాది భాషలు సహా హిందీ, ఇంగ్లీషు, ఫ్రెంచి భాషల్లోకి ఆయన కథలు, కవితలు అనువాదమయ్యాయి. మూడేళ్ళక్రితం విశాఖవారి ‘అక్షర గోదావరి’ పురస్కారం పొందిన సందర్భంగా వచ్చిన ఆలోచనతో గోదావరి పరీవాహక గ్రామాల నేపథ్యంలో దేవదానంరాజు రాసిన 14కథల సంపుటి ఈ పుస్తకం. ఆ ప్రాంత మనుషుల అంతరంగాలను శోధించి రాసిన వాస్తవ సంఘటనల కథారూపాలే దాదాపు ఇవన్నీ. జీవనది అన్ని రకాల జీవన ఘటనలకు కేంద్రంగా భాసిల్లుతుందని చాటే వైవిధ్యమైన కథలివి. గోదారితో మమేకమైన ఆ ప్రాంతవాసుల జీవితాలు, గోదారమ్మతో వారికున్న మానసికానుబంధాన్ని చాటే కథలివి.

 

కథల గోదారి
దాట్ల దేవదానం రాజు
ధర 120 రూపాయలు
పేజీలు 148
ప్రతులకు రచయిత, 8–1–048, ఉదయిని, జక్రినగర్‌, యానాం–533464 సెల్‌ 94401 05 987