మదరాసు నగరంతో అనుబంధం ఉన్న తెలుగువారి జీవితాలను చిత్రించిన 36 కథల సంపుటి ‘ఈ మదరాసు బదుకులు’ పుస్తకం. రచయిత, ఆకాశవాణి అధికారి డా. నాగసూరి వేణుగోపాల్‌ మిత్రులతో కలిసి చెన్నరసం (చెన్నపురి రచయితల సంఘం) స్థాపించి విస్తారమైన లక్ష్యాలతో చెన్నపురి, పరిసర ప్రాంత తెలుగువారిని ఏకంచేసి ఒక ఊపు తీసుకువచ్చిన ఫలితమే ఈ పుస్తకం. మదరాసులో సమకాలీన పరిస్థితులు, తెలుగువారి బతుకులు, వారికి ఎదురవుతున్న చేదుఅనుభవాలు, సమకాలీన, చారిత్రక సంఘటనలపట్ల వారికున్న మనోవేదన, ఆలోచనలను కళ్ళకుకట్టే 36 కథలివన్నీ. 

 

మదరాసు బదుకులు
చెన్నపురి కవితలు
సంపాదకుడు  నాగసూరి వేణుగోపాలరావు , డా.రాయదుర్గం విజయలక్ష్మి , భువనచంద్ర
ధర 250 రూపాయలు, పేజీలు 278
ప్రతులకు  చెన్నపురి  రచయితల సంఘం, మైలాపూర్‌, చెన్నై–04 సెల్‌ 09840331820 
మరియు తెలుగు రాష్ర్టాల్లో ప్రముఖ పుస్తక దుకాణాలు