తెలుగుజాతికి గర్వకారణం ఘంటసాల. ఈనాటికీ, ఏనాటికీ గాయకులకు ఆయన మార్గదర్శకులే. ఆయన చిత్రేతర భక్తిగీతాలు, పద్యాలు, యక్షగానాలు, బుర్రకథలు, అష్టపదులు, లలితగీతాలు మున్నగువాటి గురించి ఈతరం వారికి అందించాలనే సంకల్పమే ఈ రచన. ఘంటసాల సాహిత్య సంగీతాంశాలను సునిశితంగా పరిశీలించి చేసిన మధుర వ్యాఖ్యానమిది. సంగీత సాహిత్య విద్వన్మణి డా.ఎం.పురుషోత్తమాచార్యులు వారు చేసిన సమతుల్య విశ్లేషణ ఈ పుస్తకం.

మన ఘంటసాల సంగీత వైభవం

డా.ఎం.పురుషోత్తమాచార్య

ధర: 225 రూపాయలు

పేజీలు: 342

ప్రతులకు: డా.కె.వి.రావు,

సెల్‌:9848742320, నవోదయ బుక్‌హౌస్‌, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌.