జగమెరిగిన కార్టూనిస్టు సరసి (సరస్వతుల రామనరసింహం). అంతర్జాతీయ, జాతీయ అవార్డులెన్నింటినో సొంతం చేసుకున్నారాయన. మధ్యతరగతి మందహాసాన్ని ఒడిసిపట్టిన కార్టూనిస్టు సరసి. పుష్కరకాలంపైగా నవ్యవీక్లీలో ‘మనమీదేనర్రోయ్‌’ శీర్షిక నిర్వహిస్తూ తెలుగువారికి ఆత్మీయులయ్యారు. ఆయన కార్టూన్లు ఇప్పటికే పలు పుస్తకాలుగా వచ్చాయి. ఈ తాజా సంకలనం ‘నవ్వేడేస్‌’ జీవితంలోని సకల పార్శాల కార్టూన్లన్నీ మనకిందులో కనిపిస్తాయి. మన ఒత్తిడిని ఇట్టే తీసిపారేయగల కార్టూనిస్టు సరసి. ఎవరికైనా బహుమతిగా ఈయదగ్గ నవ్వుల పూలగుత్తె ఈ పుస్తకం.

 

నవ్వేడేస్‌
సరసి కార్టూన్లు
ధర 130 రూపాయలు
పేజీలు 212
ప్రతులకు ఎం.రామనరసింహం, అనంతసరస్వతీనగర్‌, మల్కాజ్‌గిరి, హైదరాబాద్‌–47 
సెల్‌ 94405 42 950., నవోదయ బుక్‌హౌస్‌, కాచిగూడ, హైదరాబాద్‌–27 ఫోన్‌ 040–24652387