ఇందులో ఉన్నవన్నీ చదువుకు సంబంధించిన కథలే. సమకాలీన విద్యార్థుల మానసిక స్థితి, టీచర్ల ప్రవర్తన, పిల్లల్లో ఉండే షార్ప్‌నెస్‌, విద్యాలయాలు, ఉపాధ్యాయులు ఎలా ఉంటున్నారో, వాళ్ళు ఎలా ఉండకూడదో, దానివల్ల కలుగుతున్న నష్టం ఏమిటో, విద్యార్థులపట్ల ఉపాధ్యాయుల ప్రవర్తన ఎలా ఉండాల్సిన అవసరం ఉందో, తల్లిదండ్రులు ఎలా ఆలోచించాలో, ఎలా ఆలోచించకూడదో...ఇలా అనేక విషయాల్ని వ్యంగ్యం, చమత్కారం కలగలిపి చెప్పారీ 18కథల్లో. కొడవటిగంటి కుటుంబరావుగారు గతంలో ‘చదువు’ అనే నవల రాశారు. ఆ తర్వాత చదువు గురించి, అందునా సమకాలీన చదువు తీరుతెన్నుల గురించి బహేశా ఇంత సీరియస్‌గా ఆలోచించి కథలు రాసిన రచయిత లేరు.


జోన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

ధర :100రూపాయలు, పేజీలు : 128

ప్రతులకు : నవోదయ బుక్‌హౌస్‌, ఆర్యసమాజ్‌ ఎదురుగా, హైదరాబాద్‌–27 ఫోన్‌ 040–24 65 23 87