కవి, కథానవలా రచయిత, సాహిత్య విమర్శకుడు పలమనేరు బాలాజీ. తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు భాషాపురస్కారాల గ్రహీత. ఇది. ఆయన తాజా కథల సంపుటి. ఎన్నో ప్రేమల గురించి, మరెన్నో తీరని వెతల గురించి ఆయన రాసిన పన్నెండు కథలిందులో ఉన్నాయి. వస్తువైవిధ్యం ఆయన ప్రత్యేకత. చిత్తూరుజిల్లా గ్రామీణ రైతు సమస్యలు, రాయలసీమ నీటి సమస్య, సాటి మనుషుల అమానవీయ ప్రవర్తనలు, యాంత్రిక జీవనశైలి, వంటి సమస్యలన్నింటినీ ఇందులోని కథల్లో ప్రతిబింబిస్తాయి. ఇక టైటిల్‌ కథ, ఇంటి బాధ్యతల్ని తప్పించుకుతిరిగే భర్తలకు కనువిప్పు.

 

ఒక సాయంత్రం త్వరగా ఇల్లు చేరినప్పుడు
పలమనేరు బాలాజి
ధర 100 రూపాయలు
పేజీలు 158
ప్రతులకు శ్రీమతి గండికోట వారిజ, 6–219, గుడియాత్తం రోడ్డు, పలమనేరు–517 408 చిత్తూరుజిల్లా
సెల్‌ 9440995010., ఆర్‌.ఆర్‌. బుక్‌ సెంటర్‌, పలమనేరు, మణి బుక్‌స్టాల్‌, సండేమార్కెట్‌, నెల్లూరు., విశాలాంధ్ర, నవతెలంగాణ, ప్రజాశక్తి, నవచేతన, నవోదయ.