జీవితం ఎప్పుడూ విలువైనదే! ఆవేశంలో చేసే తప్పులకి మూల్యం చెల్లించుకోక తప్పదు అనే చిన్న కోణాన్ని అర్ధం చేసుకుంటే నేరాలు జరగవని, ఈ నవల్లో చెప్పకనే చెప్పారు రచయిత శ్రీధర. ఎన్నో మలుపులతో, మరెన్నో కోణాలతో, చివరివరకూ హంతకుడు ఎవరో తెలియకుండా నవల సాగిన తీరు ఎంతో థ్రిల్లింగ్‌గా, ఆసక్తికరంగా ఉంది. ఆ రకంగా చూస్తే రచయిత దీన్ని డిటెక్టివ్‌ నవలగా తీర్చిదిద్దటంలో విజయం సాధించారనే చెప్పవచ్చు. 
 
- లక్ష్మీ నర్మద
 
 
ఒయాసిస్ (అపరాధ పరిశోధనా నవల) 
రచయిత: శ్రీధర 
పేజీలు: 175 
కాపీలకు: వేద ప్రచురణలు, 
8-53 గౌతమ్‌ నగర్‌, దిల్‌షుక్‌నగర్‌, హైదరాబాద్‌ - 500060