ప్రజల్లో పెరిగిన ఆరోగ్య చైతన్యం, మారిపోతున్న ఆహార అలవాట్ల నేపథ్యంలో సిరిధాన్యాలకు ఎంతో ప్రాధాన్యం పెరిగింది.. ఇప్పుడు వైట్‌ రైస్‌ తినేవారి సంఖ్య తగ్గిపోతోంది. కొర్రబియ్యం, సామబియ్యం, అరికబియ్యం, ఊదబియ్యం, అండుకొర్రబియ్యం వంటివి సంపూర్ణమైన ఆరోగ్యమూలాహారాలుగా తెరమీదకు వస్తున్నాయి. అయితే ఈ సిరిధాన్యాలు మన శరీరానికి ఎలాంటి మేలు చేస్తాయో, వాటితో వంటలు, పిండివంటలు ఎలా తయారుచేసుకోవాలో తెలియజెప్పే పుస్తకమిది. సిరిధాన్యాలపై తెలుగు ప్రజలకున్న అనుమానాలను నివృత్తిచేసే గ్రామీణ స్వాలంబన జీవి డాక్టర్‌ ఖాదర్‌ వలీ ప్రచురణ ఈ పుస్తకం. 

 

పాక సిరి
సిరిధాన్యాలతో వంటలు–పిండి వంటలు
రచన: సాయిలత, అనూరాధ, హైమాకిరణ్‌
ధర 150 రూపాయలు
పేజీలు 128
ప్రతులకు రైతునేస్తం పబ్లికేషన్స్‌, దక్షిణభారత హిందీ ప్రచారసభ కాంప్లెక్స్‌, హైదరాబాద్‌–004 
సెల్‌ 96 76 79 77 77