డబ్బు సంపాదించి భవితకోసం కూడబెట్టుకునే మధ్యతరగతి విక్రమార్కులకోసం ప్రముఖ రచయిత అరిపిరాల సత్యప్రసాద్‌ రాసిన 40 కథల సంపుటి ఈ పుస్తకం. మోసాలకు కేరాఫ్‌ ఆడ్రస్‌గా మారిన మదుపు కీరారణ్యంలో, ఆ పద్మవ్యూహం నుంచి తప్పించుకుని డబ్బుని ఎలా కాపాడుకోవాలో, కుబేరుడిలా కూర్చుని లాభదాయకమైన వడ్డీ ఎలా సంపాదించుకోవాలో అతి సులభంగా అర్థమయ్యేట్టు చెప్పిన ఆర్థిక సూత్రాలే ఈ కథలు. పెట్టుబడికి మెరుగైన మార్గాలేమిటో తమాషా కథలుగా చెప్పారు.

 

రూపాయి చెప్పిన బేతాళ కథలు
అరిపిరాల సత్యప్రసాద్‌
ధర 150 రూపాయలు
పేజీలు 252
ప్రతులకు అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు., www.amazon.in, 
e-–book:www.kinige.com