కులవివక్షపై గురి ‘తప్ష’ 

‘కులమనేది ఎవడు పుట్టిచ్చిందో? వాని యాలి ముండవొయ్య. ఎవనికెవడూ కలవకుంట జేసిండ్రు. ఎవని రక్తమైన ఎర్రగనే ఉంటది. గోదలకాడ్కి గోదలు పోతయి. గొర్లకాడికి గొర్లు పోతయిగని మనిషి కాడికి మనిషిని పోకుంట జేసిండ్రురా .. బాపనిండ్లళ్ల బస్టోడు లేడా? మాదిగిండ్లల్ల మంచోడు లేడా? కులంతోటి ఏందిరా .. గుణం మంచిగుండాలె’ - ‘బోధ’ కథలో ఒక పాత్ర ద్వారా రచయిత వెలిబుచ్చిన అక్షర ముత్యాలివి. ఈ మాటలు చాలు కుల వివక్ష పట్ల రచయిత గుండె కొలిమిలో ఎంత ఆక్రోశం ఉందో అర్థం చేసుకోవడానికి. బిచ్చమెత్తుకునే పిల్లలను చేరదీసి వారికో మార్గం చూపిన హాస్టల్‌ వార్డన్‌ కథ ‘మార్పు’. కులాన్ని బట్టి పిలిచే పెండ్లి పిలుపులను మూకుమ్మడిగా బహిష్కరించి ఆత్మగౌరవంతో జీవించాలనుకునే మిత్రుల ఐకమత్యాన్ని చాటి చెప్పిన కథ ‘తప్ష’ (నిర్ణయం). అలాగే వర్గీకరణ ఆవశ్యకతను చెప్పిన కథ ‘పంచుకోండ్రి’. కథల్లోని ప్రాంతీయ పలుకుబళ్లు, అందమైన మెదక్‌ జిల్లా మాండలీకం చదువరికి కలకండ రుచిని అందిస్తాయి. 
- తహిరో 

తప్ష (కతలు), సిద్దెంకి యాదగిరి, 
పేజీలు : 151, వెల : రూ.120 
ప్రతులకు: 94412 44773