నిఖార్సైన ప్రాపంచిక దృక్పథమున్న రచయిత కాలువ మల్లయ్య. నాలుగు దశాబ్దాల అవిశ్రాంత సాహితీ సృజనలో 950కి పైగా కథలు, 15వేలపేజీల రచనలు చేసిన లబ్ధప్రతిష్ఠుడు. తెలంగాణలో తెలుగులో అత్యధిక కథలు రాసిన రచయితగా త్వరలోనే వెయ్యి కథల స్థాయికి చేరుకోనున్నారు. ఆయనవన్నీ మానవతా పరిమళం గుబాళించే రచనలే. తాజాగా కథాసాహిత్య వ్యాసాలు, తెలంగాణ వ్యాసాలు, నానీలు మూడు పుస్తకాలుగా మనకు అందించారు. ఈ తరానికి కెరీర్‌లో ఉపయోగపడేలా తెలంగాణ–తెలుగు సాహిత్యాన్ని పరిచయం చేసే 14 వ్యాసాల సంపుటి ‘తెలంగాణకథ–తెలుగుకథ’ మొదటిది కాగా, పలు పత్రికల్లో వచ్చిన తెలంగాణ కోసం రాసిన 32 వ్యాసాల సంపుటి మరొకటి. ఇక మూడవది నానీలు. ‘జీవన దృశ్యాలు’ ఆయన రాసిన మూడవ కవితా సంపుటి. మానవజీవిత పార్శ్వాలను సాక్షాత్కరింపజేసే బతుకు భాష్యాలే ఇవన్నీ. 

 

తెలంగాణకథ– తెలుగు  కథ
కథా సాహిత్యంపై వ్యాస సంపుటి
డా. కాలువ మల్లయ్య
సంకలనం డా.పడాల జగన్నాథరావు
ధర 125 రూపాయలు, పేజీలు 140
ప్రతులకు ప్రముఖ పుస్తక దుకాణాలు, సెల్‌ 9032564314. 


నా తెలం‘గానం’ వ్యాసాలు

డా.కాలువ మల్లయ్య
ధర 150 రూపాయలు
పేజీలు 172


జీవన దృశ్యాలు (నానీలు)

డా.కాలువ మల్లయ్య
ధర 75 రూపాయలు
పేజీలు 100

ప్రతులకు డా. కాలువ విజయలక్ష్మి, హైదరాబాద్‌–35 సెల్‌ 9849377578.

నవోదయ, విశాలాంధ్ర, ప్రజాశక్తి, సహచర, దిశ పుస్తక కేంద్రాలు