తెలుగువారి అభిమాన రచయిత మల్లాది తొమ్మిదిరోజుల చైనాలో పర్యటన విశేషాలే ఈ ట్రావెలాగ్‌ పుస్తకం. చైనాలో సందర్శనీయాలు, అనుభవాలు, చైనా ప్రత్యేకతలు, అక్కడ కనిపించిన అభివృద్ధి, చైనాకు, మనకూ ఉన్న తరతమభేదాలు...ఇలా ఎన్నో విషయాలిందులో చదువుకోవచ్చు. ప్రయాణంలో, పర్యటనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మనకు వివరిస్తారు రచయిత.

 

ట్రావెలాగ్‌ చైనా
మల్లాది వెంకట కృష్ణమూర్తి
ధర 150 రూపాయలు
పేజీలు 136
ప్రతులకు లిపి పబ్లికేషన్స్‌, గాంధీనగర్‌, హైదరాబాద్‌–80 సెల్‌ 9849022344