నలభైఎనిమిదేళ్ళుగా కలం ఝుళిపిస్తున్న తెలుగువారి ప్రియమైన రచయిత మల్లాది. 3,500 పిల్లల కథలు, 100 నవలలు, పాతిక సినిమాలు, 1500కథల అనువాదాలు...ఇంకా ఎన్నో!
స్టాండ్స్‌లోకి వచ్చిన ఆయన రెండు తాజా పుస్తకాల్లో ఒకటి ‘దేవుడికే తెలియాలి!’ ప్రపంచంలో జరిగిన అంతుబట్టని విచిత్ర సంఘటల్ని, తార్కిక వివరణకు దొరకని ఘటనల్ని 55 శీర్షికల్లో ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఇవన్నీ విభ్రాంతికి గురిచేస్తాయి, విన్నోదాన్నిస్తాయి, ఆలోచింపజేస్తాయి. 

మరో పుస్తకం ‘ట్రావెలాగ్‌ జపాన్‌’. స్పజన, శ్రమ జపాన్‌వాళ్ళ తత్వం. సాంకేతికతను జపాన్‌ ఎలా ఉపయోగించుకుంటోంది? వాళ్ళ ఉత్పత్తులు ఎందుకు నాణ్యమైనవి? వాళ్ళకుటుంబ జీవనం ఎలా ఉంటుంది? లాంటి ఎన్నో విషయాల్ని విపులంగా వివరించారు మల్లాది. 32 కలర్‌ఫొటోలు ఈ పుస్తకానికి ప్రత్యేక ఆకర్షణ. 

 

ట్రావెలాగ్‌ జపాన్‌
మల్లాది వెంకట కృష్ణమూర్తి
ధర 150 రూపాయలు
పేజీలు 136
ప్రతులకు లిపి పబ్లికేషన్స్‌, గాంధీనగర్‌, హైదరాబాద్‌–80 సెల్‌ 9849022344