తెలుగు కథా ప్రపంచానికి పరిచయం అక్కరలేని పేరు ఆడెపు లక్ష్మీపతి. కథా శిల్పంపై ప్రత్యేక శ్రద్ధతో ఎన్నో కథలు రాసి వాటిని ‘నాలుగు దృశ్యాలు’ (1997) పేర వెలువరించిన ఆడెపు లక్ష్మీపతి గత పాతికేళ్ళుగా సమకాలీన సాహిత్యంపై అప్పుడప్పుడు రాసిన సాహిత్య విమర్శా వ్యాసాలను ఇన్నాళ్ళకు ‘దిక్చక్రం’ పేర వెలువరించారు. ఈ సందర్భంగా ‘వివిధ’ కోసం ఆడెపు లక్ష్మీపతితో ముఖాముఖి.

మీ తొలి విమర్శ గ్రంథం ‘దిక్చక్రం’ వెలువరించినందుకు అభినందనలు. కథా రచయితగా మొదలైన మీరు విమర్శ వైపు ఎలా ఆకర్షితులయ్యారు?

నేను ప్రధానంగా కథా రచయితనే. అయితే ఈ మధ్య కొన్ని కారణాల వల్ల నేను కథలు రాయడం తగ్గిపోయింది. చదివే అలవాటు మాత్రం మానుకోలేదు- కథలు, నవలలు, ముఖ్యంగా ఎక్స్‌పెరిమెంటల్‌ ఫిక్షన్‌, క్లాసిక్స్‌ చదువుతూనే వున్నాను. విమర్శ, సమీక్ష నా రెగ్యులర్‌ వ్యాసంగం కాదు. కొన్ని ప్రపంచ ప్రసిద్ధ రచనల్ని, అంతర్జాతీయ ఆంగ్ల పత్రికల్లోని ఫిక్షన్‌ని, నాన్‌ఫిక్షన్‌ని చదువుతున్నప్పుడు నన్ను ఆకట్టుకున్న కొత్త సాహిత్య ధోరణులు, కథనరీతులను మనవాళ్ళకు పరిచయం చేయాలని కొన్ని వ్యాసాలు రాశాను. నాకున్న సాహిత్య అవగాహన లోంచి వివిధ ప్రక్రియలపై జనరల్‌గా నా అభిప్రాయాలు వెలిబుచ్చుతూ, కొన్ని తెలుగు కథా కవిత్వ పుస్తకాలను, నవలలను విశ్లేషిస్తూ మరికొన్ని వ్యాసాలు రాశాను. తెలుగు సాహిత్యంలో సమీక్ష, విమర్శ సంతు లితంగా ఉండటం లేదనీ, రాగద్వేషాలతోనో, ఏకపక్షంగానో చేసే సమీక్షలు, విమర్శలు సాహిత్యానికి హానికరమైనవనీ, సాహిత్యకారుల్లో విమర్శను సహించే గుణం బొత్తిగా లోపించడమే ఈ పెడధోరణి ప్రబలడానికి కారణమనీ నేనంటాను. గతంలో పలు సందర్భాల్లో నేను లేవనెత్తిన అంశాలనే చాలా వ్యాసాల్లో పొందుపరచాను. ఇది విమర్శ అనండి, విశ్లేషణ అనండి.

నేడు మన సాహిత్యంలో మీరంటున్న ఈ ‘పెడ ధోరణి’ పోవాలంటే ఏం చేయాలి?

సమీక్షకులు/ విమర్శకులు/ విశ్లేషకులుగా పేరు పొందినవాళ్ళు సంయమనం పాటించాలి, వ్యక్తిగత స్నేహాలు, ప్రేమాభిమానాలు పక్కన పెట్టెయ్యాలి. ఆత్మాశ్రయ ధోరణి, పక్షపాత వైఖరి విడనాడాలి. పుస్తకాలకు ముందుమాటలు, పరిచయ వాక్యాలు రాసే సాహితీ వేత్తలు, ఆవిష్కరణ సభల్లో ప్రసంగించే ప్రముఖులు ఆబ్జెక్టివ్‌గా వ్యవహరించాలి; లోపాలు సున్నితంగా ఎత్తి చూపాలి. ఒక రకంగా పుస్తకాల ‘నాణ్యత’ని తూచే ఖిఛిజిౌజ్చూట ్చుఽఛీ జ్ఛుఽ్టజ్ఛూఝ్చుఽ తాను నిర్మొహమాటంగా వ్యవహరిస్తేనే తన అభిమాని ఎదుగుతాడన్న సత్యం గ్రహించాలి. ఇక రచయితలు, కవులు విమర్శ ఎలా వున్నా ఓపెన్‌ మైండ్‌తో స్వీకరించి స్వీయమదింపు చేసుకునే తత్వం అలవర్చుకోవాలి. ఇౌఝఞజ్చూఛ్ఛిుఽఛిడ తలకెక్కితే తనకే నష్టమన్న వాస్తవం ప్రతివొక్కరూ తెలుసుకోవాలి.

పలువురు సాహితీవేత్తలు, అకడమీషియన్లు కథ, నవల, కవిత్వం గురించి విస్తారంగా రాశారు కదా! మీ విమర్శా వ్యాసాల్లో ఏమైనా కొత్తగా చెప్పారా?

ప్లాట్‌, థీం, స్టొరీ, శిల్పం.. వగైరాల గురించి చాలా రాశారు, కానీ వాటిలో స్పష్టత లేదు అని నా అభిప్రాయం. కథావస్తువు, ఇతివృత్త నిర్మాణం, నెరేటివ్‌ స్ట్రక్చర్‌ (కథా సంవిధానం) లోని పలు దశలు (ఫ్రైటాగ్స్‌ ట్రియాంగిల్‌), శిల్పం, ఆధునికానంతర కథన పద్ధతులు, ప్రయోగాల గురించి కొంత చెప్పాను. ప్రముఖ పాశ్చాత్య రచయితల కథలను, నవలలను కొన్నింటిని-వాటి ప్రత్యేకతలను వివరిస్తూ పరిచయం చేశాను. అట్లాగే కవిత్వంలో మితిమీరిన జటిలత్వం, అతి పలుచదనం కూడదని చెప్పాను. ఇవి కొత్తగా రాస్తున్న వారికి ఉపయోగపడతాయని భావిస్తున్నాను.