ఇంట్లో వుండాలనిపించటం లేదు... అస్తమానం ఎటేనా బైటికి వెడితే బావుండుననిపిస్తోంది మధురిమకి. ఏ ఇబ్బందీ లేదు... ఎప్పుడు... ఎక్కడికి ఎలా అంటే అలా వెళ్ళగల అవకాశం వుంది. బైట వాతావరణం చల్లగానే వుంది. అయినా తన గదిలో ఎ.సి. మరింత చల్లగా పని చేస్తోంది.అప్పటికి టి.వి.ఛానల్స్‌, ఓ పదిసార్లు అటూ, ఇటూ ఇష్టమొచ్చినట్టు మార్చింది. చెయ్యచాచితే అందే మ్యూజిక్‌ సిస్టమ్‌ రెండుసార్లు ఆన్‌చేసి ఆఫ్‌ చేసింది.ఏదో కావాలి.... ఏదో జరగాలి...మనసుకి, శరీరానికి కూడా బద్ధకంగా వుంది.పడుకున్న మంచం మీంచి లేస్తే, ఏదో ఒకటి చెయ్యటానికి చాలా అవకాశా లున్నాయి. కింద వున్న తల్లి దగ్గరకి వెళ్ళచ్చు. ఇంట్లోని హోమ్‌ ధియేటర్‌కి వెళ్ళి ఎటువంటి సినిమాయేనా చూడొచ్చు లేదా బార్‌ రూమ్‌కి వెళ్ళి కావాల్సింది తాగొచ్చు. కానీ మధురిమకి మంచం మీంచి లేవటానికి కావాల్సిన ఉద్వేగమే కలగటం లేదు.‘థ్రిల్‌... థ్రిల్‌’ అని సెల్‌ మోగింది. మధురిమ సెల్‌ చూసింది. ఫీడ్‌ అయిన నెంబర్‌ కాదు. ఎవరూ అని అడిగే లోపే.‘మధురిమ... నేను దివాకర్‌ని’వెంటనే కాకపోయినా, ఓ క్షణంలో గుర్తొచ్చాడు. ‘‘హాయ్‌... దివాకర్‌...’’ అంది.‘‘శుక్రవారం సాయంత్రం ఫ్లైట్‌కి గోవా టిక్కెట్‌ బుక్‌ చేశాను. మేరియట్‌లో మకాం. సోమవారం పొద్దున్నే వచ్చేదాం...’’‘‘ఏమిటిదంతా...?’’‘‘మొన్న మనం కలిసింది మొదటిసారే అయినా, అప్పుడే చెప్పాగా వీక్‌ ఎండ్‌ కలిసి గడుపుదామని’’ అన్నాడు.‘‘అంటే... నేను ఒప్పుకోకుండానే ఏర్పాట్లు చేసెయ్యటమేనా?’’‘‘ఇప్పుడేమైంది... నువ్వు వస్తే నా అదృష్టం. కాదంటే నా దురదృష్టం’’ అన్నాడు.మధురిమ ఏం మాట్లాడలేదు.మరో క్షణం తర్వాత... ‘‘ఓకేనా’’ అన్నాడు. ‘‘ఒకే అంది’’ మధురిమ.

ఎందుకు అలా ‘సరే’ అన్నాను.... అన్న ఆలోచన సాగింది మధురిమలో. బహుశా దివాకర్‌ పద్ధతి కావచ్చు. పెద్దగా వెనకా ముందు పీకులాట లేని నిర్ణయం. ఏదైనా సరే అన్న ధీమా. అదే సమయంలో ఇది కావాలి అన్నకాంక్ష.ఇదీ అని తెలియక పోయినా, మధురిమ మనసు తేలికపడింది. ఉత్సాహంగా నవ్వుకుంటూ వుండగా, మళ్ళీ సెల్‌.ఆచారి‘‘మధురిమా నేనే... ఈ వీకెండ్‌ కూడా బిజీ ఏనా’’ చాలా నెమ్మదిగా అడిగాడు.ఏదో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తాడు. మనిషి మరీ మెత్తన... ఎప్పట్నించో మధురిమని అడుగుతూనే వున్నాడు.‘‘అవును చారి. బైటికి వెడుతున్నా...’’ అంది మధురిమ.‘‘సరేలే..’’ అన్నాడు. అతని గొంతులో ఆశాభంగం తెలుస్తూనే వుంది. అయినా అదేమి ఆలోచించేలా లేదు... మధిరమ.దివాకర్‌ ఫోన్‌ కన్నా ముందు ఆచారి ఫోన్‌ చేసుంటే... అప్పటి పరిస్థితిలో ఏం చేసేదో... కానీ ఇప్పుడంతా దివాకర్‌ మాటలే గుర్తొస్తున్నాయి.‘‘శుక్ర, శని, ఆదివారం... మూడు రాత్రులు... సోమవారం వెనక్కి...’’ మూడు రాత్రులు అన్న మాటల్ని అందమైన రహస్యంలా పలికాడు.్‌్‌్‌ప్రయాణం జరుగుతున్నంత సేపూ, విమానంలో చాలా మర్యాదగా ప్రవర్తించాడు దివాకర్‌. ఏ రకం తొందర పాటు గానీ, కక్కుర్తి గానీ చూపించక పోవటం మధురిమకి బావుంది. మరీ ఎక్కువగా మాట్లాడు కోక పోయినా సరదాగా జోక్‌ చేసుకున్నారు.వీళ్ళు ఎయిర్‌పోర్ట్‌ బైటికి వచ్చేటప్పటికే కారు సిద్ధంగా వుంది. మేరియట్‌ జేరటానికి గంట పట్టింది. ఇద్దరూ రూమ్‌ చేరారు.