ప్రేమ... ప్రేమ... ప్రేమ... ప్రేమంటే ఏమిటి? స్త్రీ పురుషుల మధ్య సంబంధం మాత్రమే ప్రేమవుతుందా..? ఇద్దరి మధ్య శారీరక సంబంధం లేకుంటే ప్రేమ సంపూర్ణం కాదా...? తల్లీ కొడుకుల మధ్య, తండ్రీ కూతుర్ల మధ్య, తండ్రీ కొడుకుల మధ్య, తల్లీ కూతుళ్ళ మధ్య మనిషి మనిషి మధ్య ఉన్నది ప్రేమ కాదా..? అసలు, ప్రేమంటూ లేని సమాజం ఉంటుందా..? మరెటు పోయిందీ సమాజం..?ఆదిమ సమాజంలో ప్రేమ లేదా..? ఓ వస్తువును ప్రేమించడం, ఓ పనిని ప్రేమించడం, ఓ ప్రదేశాన్ని ప్రేమించడం, దేశాన్ని ప్రేమించడం లాంటివన్నీ ప్రేమలు కావా..?ఎటు పోతున్నాయి ప్రేమలు..? ఏమవుతున్నాయి? ఓ మిత్రుడన్నట్టు మానవ సంబంధాలన్నీ డబ్బు సంబంధాలేనా? అయితే ప్రేమెక్కడుంటుంది..? ప్రేమెందుకుంటుంది?ఇంతకీ ప్రేమంటే ఏమిటి..?ఓ వస్తువును ప్రేమించడం, మనిషిని ప్రేమించడం ఒక్కటేనా..?మనుషుల మధ్యనున్న సంబంధాలు ప్రేమ సంబంధాలు కావా..?ఏది ప్రేమ..? ఎందుకు ప్రేమ...?పెదవులపై మాటలు పెరిగిపోతున్నాయి..?కృతిమత్వమూ పెరిగిపోతుంది...కుటిల తత్వమూ పెరిగిపోతుంది...మరి ప్రేమెక్కడుంటుంది...?ప్రేమ... విలువలు.. విలువలంటే ఈ వస్తువు విలువెంత అని హాస్యాస్పదంగా నవ్వేరోజులు...ఎక్కడున్నాయి విలువలు..? ఏమయ్యాయి..? ప్రేమ, విలువలు పరస్పర సంబంధితాలా...?పరస్పర ప్రభావితాలా...?

విలువలే లేకుంటే ప్రేమెక్కడుంటుంది....అసలు విలువలే లేవా..?సమాజం ఎటు దిక్కు పయనిస్తుంది..?బహువచనం నుండి ఏకవచనంలోకా..?తిరోగమదిశలో పయనం సాగిస్తుందా....ఓ ఆప్యాయమైన పలుకరింపుకోసం... ఓ అనురాగపూరిత మైన మాట కోసం ఎంతోమంది తపిస్తున్నారు...మా ఇంటి కొస్తే నాకేం తెస్తావు..?మీ ఇంటి కొస్తే నాకేం ఇస్తావు..?ఇదేనా సమాజ గమనం..?అలాగే నడుస్తుందంటాడు మిత్రుడు...ఎందుకోసం..? దేని కోసం...?ప్రేమ లేకపోవడం వల్లనేనా..?మరి ప్రేమెందుకు లేదు..?ప్రేమ లేదా..? ఉందీ.. లేదు... ఉండీ లేదు..ఎందుకు లేదు ప్రేమ..?ఉంది డబ్బుపై... మనిషిపై ప్రేమలేదు.ప్రేమ లేకుండానే ఈ సమాజం మనగలుగుతుందా..?ఉంది... ప్రేమ ఉంది.. డబ్బుపై ప్రేమ..డబ్బు కోసం ప్రేమ... అధికారం కోసం ప్రేమ...మరి మనిషిపై ప్రేమ...?అవును.. తాను తపిస్తున్నాడు.ప్రేమ కోసం తపిస్తున్నాడు..మనిషిని మనిషిగా చూసే ప్రేమ కోసం...సమాజంలో ప్రేమ లేనందువల్లనేనా దుర్మార్గాలు..?అల్లర్లు..?పిల్లలు ప్రేమ లేకుండానే పెరిగారా..?పెరుగుతున్నారా..?జీవితంలో వేగం పెరిగింది..వేగంతో పాటు ప్రేమ తగ్గింది.ప్రేమ, వేగం విలోమాను పాతంలో ఉంటాయా...ప్రేమ - ధర్మం..ఇవి రెండు అనులోమానుపాతంలో ఉంటాయా..?

సమాజం అంతా చెడ్డేనా? మంచనేది లేదా..?ప్రేమ, మంచి లేకుంటే వర్షాలెలా పడుతాయి?ప్రేమ లేకుండా సమాజమెలా నిలుస్తుంది...?ధర్మరాజు.. కాదు కాదు.. పాండవులున్న చోట వర్షాలు బాగా పడే వంటారు.. అంతా సుభిక్షంగా ఉండేదంటారు.ఇది నిజమేనా..? వఠ్ఠి కతనా..?ఏది ఏమైనా మంచున్న చోట సుభిక్షంగా ఉంటుంది.లేదా మంచే సుభిక్షమని...మరి పాపాత్ములున్న చోటు..? మరి వాళ్ళు లేందెక్కడ..?మధర్‌ థెరిస్సా లాంటి మానవ సేవాతత్పరులు.. మహాత్మాగాంధీ లాంటి సత్యవాక్పరి పాలకులు ఉండేవారు కాబట్టే ఈ మాత్రమైనా ధర్మం బతికుంది...రోజు రోజుకూ ప్రేమ తగ్గుతోందా..?అంటే.. అంటే... గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్‌ అన్న వాక్యం నిజమేనా..?కాదు.. కాదు... రాచరిక వ్యవస్థులున్న గతకాలము వచ్చుకాలము కంటె మెరుగైనది కానేకాదు...అయితే గియితే ఆ గతకాలము రాచరిక వ్యవస్థను సమర్ధించేవారికి గొప్పది కావచ్చు.సామాన్య ప్రజలకు ప్రజాస్వామిక కాలమే ఉత్తమమైంది..ధర్మప్రభువు మాధవ వర్మ కథ విన్నాము కాదా..!న్యాయం కోసం తన ఏకైక పుత్రునికి ఉరిశిక్ష వేసాడు రాజు...అలాంటి రాజు లిప్పుడున్నారా..?