కుటుంబరావు..సాన్వి... ఓ ఆనందం- ఓ ప్రశ్న!ఆరు దశాబ్దాల తర్వాత ఓ చిన్నసంభాషణతో తేనెతుట్టెను కదిపింది.నేను మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు పుట్టాను ఇంతకూ నేనెవర్ని?ఇలాంటి అనుమానం ఈ ఆరు పదుల సంవత్సరాల్లో అనేక సార్లు వచ్చింది.ఎప్పటికప్పుడు ఏవేవో సమాధానాలుదొరికాయి.అవన్నీ ఆ సమయంలో కాస్త ఓదార్పునిచ్చాయి.ఎప్పటికప్పుడు ప్రశ్నల పరంపర వెంటాడుతూనే వుంది.సమాధానాల వెల్లువ కూడా!కొన్ని సందర్భాల్లో కదలకరకరకాల భావావేశాలకు లోనయ్యాను.ఎవరిమీదో కొన్నాళ్లు యుద్ధం చేసాను.ఆ తర్వాత విరామంఇప్పుడు మౌనం!మనం అన్నీ చేయగలం అనే అహంకారమోఅతి విశ్వాసమో తెలియని దశ నుంచినిశ్శబ్దాన్ని, నిర్వికారతను బతుకులో భాగం చేసుకోవటం!ఇది నా ఒక్కడి సమస్య కాదు.నేను చూసిన, చూస్తున్న ఎందరెందరో అనుభవం.మనం నిరంతర చర్చలు చేయటం, ప్రేక్షకులుగాచూస్తుండటంలోని ఆనందం అనుభవానికి తెచ్చుకోవటం అనే ముగింపుకి వస్తున్న దశలో ఈ ప్రశ్న!మనం ఏమీ చేయలేకపోవటం నిజమే కావచ్చుసాన్విలా ఓ ప్రశ్న వేయలేమా?ఈ సమాజానికి కాకపోవచ్చు.కనీసం నా కుటుంబానికి!్‌్‌్‌సాన్వి నా మనవరాలు.మూడున్నర సంవత్సరాలు. హైదరాబాద్‌ నగరంలో ‘భారతి’ విద్యాలయంలో ఎల్‌కేజీ చదువుతోంది.ఉదయం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు వాళ్ల నాయనమ్మతో ‘‘బస్‌ దగ్గరకి నువ్వు రావద్దు నేనే వస్తాను’’అంది.సరస్వతి అలాగే అని త లూపింది.నాకు ఈ రోజు నూడిల్స్‌ కావాలి. అలాగే పంపిస్తాను.అప్పుడే భుజం మీద తగిలించుకున్న ఆ బ్యాగ్‌ని చూస్తే హిమాలయ పర్వతాలు అధిరోహించటానికి వెళ్తున్న ఓ బాల యోధురాలిలా అనిపించింది.

చంద్ర మండలం మీద అడుగు పెట్టిన నీల్‌ ఆర్మ్‌స్ర్టాంగ్‌ వారసురాలు కనిపించింది- సాన్విలో.. కోడలు జయ ‘‘టైమయింది బస్‌ వచ్చేస్తోంది’’అంటూ హెచ్చరించింది.‘‘బై నాన, బై తాతారూ’’అంటుంటే ఈ చిన్నారికి అప్పుడే ఇన్ని బరువులా అనే బాధ.కళ్ల ముందే జయతో కదిలి వెళ్లిపోయింది.అప్పటిదాకా సాన్వి అల్లరితో మారుమోగిపోయిన ఇళ్లంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయింది.నేనూ-సరస్వతీ నిశ్శబ్దానికి అలవాటు పడిపోయాం.ఇప్పుడా నిశ్శబ్దంలో ఆనందమేం కనిపించటం లేదు.రోజూ మధ్యాహ్నం మూడున్నరకి ఇంటికి వచ్చేస్తుంది. అప్పటికి జయ ఇంటికి రాదు. తను ఆఫీస్‌ నుంచి వచ్చేటప్పటికి ఆరున్నర అవుతుంది. సందీప్‌ వచ్చేటప్పటికి ఏడు గంటలు. ఒక్కోసారి రాత్రి పది గంటలు దాటుతుంది.సందీప్‌ మా రెండో అబ్బాయి.నేనూ-సరస్వతి తుమ్మపూడిలో వుంటున్నాం. ఎప్పటి నుంచో మమ్మల్ని రమ్మని గొడవ చేస్తుంటే ఇప్పటికి కుదిరింది.తుమ్మపూడి విజయవాడ-తేనాలి మధ్య వుంటుంది. అక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా హాయిగా వుంటుంది.ముఖ్యంగా నాకు అక్కడ ‘సంజీవ్‌’ అనే వ్యక్తి వుండేవారు.

చనిపోయి కూడా చాలాకాలం అయింది.‘సంజీవ్‌’కోసమే నేను ‘తుమ్మపూడి’వెళ్లాను అంతకు ముందు వారి గురించి వినటం తప్ప ప్రత్యక్షంగా చూడలేదు.మొదటిసారి మాట్లాడినప్పుడు నా శేష జీవితం అక్కడే గడపాలనుకున్నాను సరస్వతి కూడా అంగీకరించింది. ‘సంజీవ్‌’గారితో ఒక్క సంవత్సరం అనుబంధమే. ఆయన వెళ్లిపోయారు.మనుషులు ఇలా కూడా వుండవచ్చునా అనిపించింది. ఆయన్ను చూసాక వారి నోటివెంట ఓ పరుష పదం గానీ ఓ వ్యంగ్య పదం గానీ వచ్చేది కాదు.కొన్ని సంవత్సరాల ప్రయాణంలో ‘సంజీవ్‌’గారు కలుసుకున్న మనుషులు- గొప్ప వ్యక్తులు- ఆయన సృష్టించిన సాహిత్యం- అవన్నీ గమనించటం వారితో కొన్ని భావాలు పంచుకోవటం నా అదృష్టం అనుకున్నాను.‘సంజీవ్‌’గారికి మరణం లేదు అందుకే భౌతికంగా ఆయన ‘తుమ్మపూడి’లో లేకపోయినా మాకు ఆ ఊరిని వదిలిపెట్టి రావాలనిపించలేదు.