చెట్లు, చేమలు, పుట్టలూ, గట్లూ, సెలయేళ్లు, కొండలు, లోయలు వన్య ప్రాణులూ, వీటితో ఆటవికులూ, పురుగూ, పుట్రా, 
అంతా గీబుగా, అల్లిబిల్లిగా, కలమెలిగి కనిపిస్తుంది అడవి.
ఆగినవారూ, ఎదిగిన నాగరికతపు నీడ పడని వారూ, నాగరికపు మెరుపునకు భయంతో ఇంకా లోనకు పారిపోయేవారూ, మన 
వీలులో చెప్పుకోవాలంటే, బొత్తిగా అనాగరికులు (ఇక్కడి వారు)
అనాదిగా అడవి వడిన, అద్దంలా, జీవిస్తున్న ఆటవికులకు, ప్రకృతే జీవనాధారం.
నిజానికి వారి జీవితమే ప్రకృతి హేలగా అనిపిస్తుంది చూడగలిగిన వారికి.

 

నాగరికుల ఆలోచనా పరిధిన, వారి పొదరిళ్ళు - జనావాసాలు కావు. ‘గుంపులు’ నిండు ప్రకృతి ఎదన కనిపించే గుజ్జనగూళ్ళు.అందుండి తుళ్ళుతూ, కేరింతలు కొడుతూ, కల్లా కపటమెరుగక సాగే, వారి బ్రతుకు తీరు, నాగరికపు అంతరంగాన్ని తాకలేదేమో! కానీ - అదో నందనవనం.అదిగో అదే కాలిబాట.కొమ్ము దువ్వెనతో నున్నగా దువ్విన కోయపడతి పాపిటలా, గజిబిజి మెలికలు, ఎగుడు దిగుళ్ళు, కళ్ళు తిరిగే లోయలు, మెడ విరిగే ఎత్తులు, పరపంజుకున్న చెట్టు చేమలు, కాయకసర్లు, కొండలూ, కోనలూ.సెలయేళ్ళ గలగలలో, వాటి నాశ్రయించుకున్న అడవి పూలలో, వాటి పరిమళాలు.వాగులూ, ఆ మరుగు నాశ్రయించి జీవించే భూ, జల, చరాలూను-అడవిన చొరబడ్డ ఈ కాలిబాట గుంపులను చేరిందాకా ఇదే తంతు అలా సాగి సాగి, నాగరికపు అంచుల్ని కల్పుతది చూడగలగాలే కానీ, ఇదో చిత్రమైన పులకింత.ఓ అపురూప దృశ్యకావ్యంఇలాంటి అనేకానేక గుంపుల సమ్మేళనమే ఈ అడవితల్లి!

అడవిన అలజడీగుంపులలోని మేలుకొలుపూ - పక్షుల కిలకిలా రావాలలో వినిపిస్తుంది, చూస్తే కనిపిస్తది.‘ఎఱ్ఱ ముద్ద’ భూమి నుంచి పైకి వస్తూ వెలుగు వెదజల్లుతున్నాది.జనమంతా పరిగెడుతున్నారు.గజిబిజిగా -అడ్డ దిడ్డంగా-దోవా డొంకా, వదిలారు -పరుగే పరుగు!ఈ అలికిడికి, గుడిసెనున్న సంగమ్మకు, మెళుకువ వచ్చింది.కళ్ళు తెరిచింది.పొద్దు ఎఱుపెక్కి కనిపించింది.నివురువిడిన నిప్పుకణికలాతడికల సందు నుంచి నులివెచ్చని సూర్యకిరణాల, నీడలు కదులుతున్నాయ్‌. కంటిని తాకుతున్నయి. లేచి పరుగున గుడిసె బయటికొచ్చింది సంగమ్మ.తోవేపు పారజూసింది.ఇక్కడో పాతిక గుంపులుంటే, వాటి నిండా గుడిసెలుంటే, అందులో ‘చదువరి’ ఈ ‘సంగమ్మ’భద్రాచలం కాలేజీలో చదువుతున్నది చదువు పూర్తయిందట.పెద్ద పరీక్షలయినంక, సెలవలిస్తే గుంపులకొచ్చింది, ఆడ శెలవిస్తే - ఈడనే ఉంటది.అడవిన ఎక్కడక్కడ నుంచో జనం కదలడం కనిపించింది.వంగి గుడిసెలోనకు తొంగి చూసింది.నులకమంచం పక్క ఖాళీగా ఉంది అంటే ముసల్ది కూడా ‘మంద’లో కల్సిందన్నమాట!అనుకుని, అనుమానం పోక, ‘అవ్వా’ అని పిలిచింది పెద్దగ-గుడిసె వెనకేపూ చూసింది లేందేం, పలుకుతదిఇటు తోవవైపు పారచూసింది మళ్ళీఓ ‘పోరడు’ లగెత్తుకుంటూ డొంకన కనిపించినాడు అరనిమిషంలో ఒడ్డు కెక్కాడు. ‘ఎవడబ్బా వాడు?’ అని జాగ్రత్తగా చూసింది.గుర్తు పట్టింది.ఈ బొట్టిగాడు, వాడే ‘రాగా’! ఎలుగెత్తి పిలిచింది. ‘రాగా’ అని‘సంగక్క’ గొంతది. ఆగిండు.‘రాగ’ అన్న పిలుపు ఇనపడ్డేపు తిరిగి చూసిండు’.‘సంగక్కేనా’’?అవును సంగక్కే.వెంటనే కూకేసిండు.‘ఓ... ఓ... ఓ...’ అని‘ఎటో’ అడిగింది? సైగా చేసింది.పెద్దగా - మన నడింగుంపు అంజమ్మ లేదూ! అదీ‘ఏడు మోటల పెద్దబావిన పడి చనిపోయిందంటున్నారు!’ అని చెప్పాడు.ఆనక ఆగలాతిరిగి పరుగో పరుగు‘అంజమ్మా! అంజమ్మా!’ అని ఆగిపోయింది ఓ క్షణం.