కడగడానికి మబ్బులు వర్షించడం మొదలుపెట్టాయి. నిర్వేదంగా చెట్టు నీడ కోసం నడుస్తోంది.అభిమన్యు ఇక్కడే ఎక్కడో చెట్టు నీడలో,పిల్లన గ్రోవి వూదుతూ కనిపిస్తాడని ఎంతో ఆశతో వచ్చింది. కనిపిం చకపోయేసరికి ప్రతి చెట్టునీ, పుట్టనీ అడిగింది. అవి మౌనంగా వుండే సరికి భయపడింది. ‘‘ఏమైంది, నా అభికి చెప్పండి’’అని నిలదీసింది. అతని జాడ చెప్పమని కళ ్లనీళ్లు పెట్టుకొని బతిమిలాడింది. జవాబు లేకపోయేసరికి కోపం వచ్చి, ఇష్టం వచ్చినట్లు నిష్టూరాలు వేసింది.‘‘అభిమన్యూ- నా బంగారు కొండా, ఎక్కడున్నావురా? నువ్వు ఎక్కడ వున్నావని వెతకనురా? ఇక ఓపిక లేదు. వెంటనే వచ్చేసెయి. నాకు ఇక్కడ ఎవరూ సాయం లేరు. నువ్వు రాకపోతే చచ్చిపోతాను’’ అని గోడుగోడున ఏడ్చింది. దిక్కులేని పక్షిలా, పచ్చటి మైదానంలో నిలువెల్లా తడుస్తూ నడుస్తోంది. కాళ్ల కింది నీరు ఉధృతంగా లాగేస్తోంది. చెట్టొకటి ఆప్యాయంగా పిలిచింది. దాని కిందకి వెళ్లి నిలబడింది.  ‘‘అభీ...అభీ...అభిమన్యూ...అభిమన్యూ’’ శక్తంతా శబ్దమైనట్లు గుండె గొంతును చీల్చుకుంటూ వచ్చిన ఆ కేకలకు అడవి విస్తుపోయింది. ప్రతి కొండ జలదరించింది. ఆమెకి సహకరిస్తూ కొండలూ, కోనలూ ‘‘అభీ...అభీ’’అని ప్రతిధ్వనించాయి. ఒక నిమిషం తర్వాత అనంతమైన నిశ్శబ్దం! ఓపిక లేనట్లు నిస్సహాయంగా చూస్తూ నిలబడింది.ఉన్నట్లుండి గాలిదుమారం...మొక్కలు, చెట్లు దాని ధాటికి నిలదొక్కుకోలేక వూగుతున్నాయి.టప్‌’మని పెద్ద వాన చినుకు తల మీద పడింది. తల ఎత్తి చూసింది. మబ్బులు దట్టంగా పట్టాయి.ఎందుకో అకాల వర్షం! చిరుచీకట్లు అలముకున్నాయి. నిరాశతోదుఃఖం పొంగింది. ఆమె కన్నీళ్లని‘‘దిక్కులేని వారికి దేవుడే దిక్కంటారు. మరి నా పరిస్థితి ఏమిటి? నన్నెందుకు ఏడ్పిస్తున్నావు?’’ కోపం దేవుడి మీదకు మళ్లింది. అంతలోనే మెత్తబడి ‘‘దేవుడా! నిన్నేమీ అడగను. నా అభిని నాకు ఇవ్వు. లేకపోతే నన్నయినా అతని దగ్గరకు తీసుకెళ్లు. నా వియోగాన్ని వాడు క్షణం కూడా త ట్టుకోలేడు. నాకు కూడా ఇపడే అర్థమవుతోంది. ఈ ఎడబాటుని నేను కూడా తట్టుకోలేనని. ప్లీజ్‌ ఈ ఒక్క మొర ఆలకించు’’ ప్రాధేయపడింది.

దేవుడు కూడా బదులు పలకలేదు.అందరి మీద నమ్మకం పోయి, అభికే మళ్లీ చెపకుంది. ‘‘అభీ! ఈ ఒక్కసారికి క్షమించు. జీవితంలో ఇంకొకసారి నిన్ను బాధపెట్టను. నిజం చెపుతున్నాను. నిన్ను విడిచి నేను బతకలేను. నువ్వు నా ప్రాణం. నేను బ్రతికేదే నీ కోసం... నన్ను నమ్ము. ఈ సారికి క్షమించి వచ్చేసెయ్యి’’ ఎన్నో ప్రమాణాలు చేస్తూనే వుంది.తన పరిస్థితి తనకే అర్థం కాని స్థితి. మనస్సుకి నిలకడ లేదు. ఏదో చెయ్యాలని... ఎటో వెళ్లిపోవాలని! ఆకలిదపలు లేవు. చలి లేదు. ఒకటే ధ్యాస. అభిని తక్షణం చూడాలి. ఇతను క్షేమంగా వున్నాడని తెలుసుకోవాలి.ఒకవేళ అభికి ఏమైనా అయితే! అమ్మో.... ఆ ఆలోచనకే గుండె ఝల్లుమంది. భయం నరాల్లో జరజరా పాకింది. ఒకవేళ అతనికేమైనా అయితే తను ఈ భూమ్మీద వుంటుందా? అతనులేని ఈ లోకంలో తనకు మాత్రం ఏం పని? ముందు అతను క్షేమంగా వున్నాడో లేదో తెలుసుకోవాలి. ఆగలేక చెట్టు కింద నుంచి కదిలి నడకసాగించింది.ఆకాశం ఫెళఫెళా ఉరిమింది. కళ్లు మిరుమిట్లు గొలిపేలా మెరిసింది.

ఎక్కడో పిడుగుపడిన చపడు. వాన కుండపోతగా కురుస్తూనే వుంది. కటిక చీకట్లో దారీ డొంకా తెలీని ప్రయాణం. అయినా మొండి ధైర్యంతో నడుస్తోంది. దేన్నీ ఖాతరు చేసే పరిస్థితిలో లేదు. ప్రేమ వున్నచోట భయం వుండదు అంటారు!నీళ్లలో దాదాపు ఈదుతున్నట్లు వుంది నడక. కాళ్లు అక్కడక్కడ బురదలో కూరుకుంటున్నాయి. పిచ్చిమొక్కలు, గడ్డి కాళ్లకి లుంగలు చుట్టుకుంటు న్నాయి. పురుగుపుట్రా ఏమున్నాయో దేవుడికే తెలుసు. ఈదురుగాలికి, వానధాటికి అరచేతులు పోట్లు పెడుతున్నాయి. తల తిరుగుడు, కడుపులో వికారం, అర్థంకాని అస్థిమితం, పరిగెత్తలేని నిస్సహాయత.‘‘భగవాన్‌-నన్ను త్వరగా గమ్యానికి తీసుకెళ్లు. ఎక్కువ సేపు తట్టుకోలేను’’ దేవుడిని మూగగా వేడుకుంది.‘‘అమ్మా... ఆగు నేనూ వస్తున్నాను’’ వెనక నుంచి పిలుపు! ఆశ్చర్యంతో వెనక్కి తిరిగిచూసింది. చీకట్లో వెన్నెలలా మెరుస్తూ ఎవరో అపరిచితుడు. అసంకల్పితంగా నడక వేగం తగ్గించింది. అతను దగ్గరకు వచ్చి ‘‘నీకు దారి తెలీదనుకుంటాను. ఇటు వైపు వెళదాం రా!’’ అన్నాడు మృదువుగా వేరే దారి చూపుతూ...