నేను ప్రత్యేకంగా గుర్తుంచుకునే రోజు ఇది. సన్నటి జల్లు పడుతోంది గానీ, ఆకాశంలో జేగురు రంగు మంటలా సూర్యుడు నిప్పుల్ని చల్లటం, ఇలా వానా ఎండా కలిసి వచ్చే సమయాలు ఎంతో ఆనందాన్నిచ్చేవి చిన్నప్పుడు. పిల్లలందరం కలిసి పెద్దగా అరుచుకుంటూ, వానా వానా వల్లప్పా అంటూ పాటలు పాడుకుంటూ, ఒకవైపు చెమట, మరోవైపు పైనుంచి వాన, అట్లా తడుచుకుంటూనే అంబేద్కర్‌ జంక్షన్‌ వైపుకు పరిగెత్తాను. లాస్ట్‌ పీరియడ్‌ ఎగ్గొట్టి, కాలేజీ బ్యాగ్‌లో దాచుకున్న ప్లకార్డును బయటకు తీశాను ‘దండోరా, మనకొత్త వెలుగు’. ప్లకార్డును పైకెత్తి పట్టుకున్నాను. ఈ కొత్త అనుభవం అద్భుతంగా ఉంది. జూన్‌ నెల. ఉక్కపోతగా ఉంది. రాత్రి తమ్ముడు చెప్పాడు, రేపు సాయంత్రం అంబేద్కర్‌ సెంటర్‌లో ఊరేగింపు ఉందని. ‘దండోరా’ అంటే ఏమిటని అమాయకంగా అడిగాను. చాలాసేపు వివరించాడు. కొంత అర్థమైంది. కొంత కాలేదు. 

కానీ ఇది నాన్నకు ఇష్టంలేదన్న విషయం మాత్రం అర్థమైంది. భయం, వణుకు, అంతలోనే తిరుగుబాటు చెయ్యాలనే తీవ్రమైన కోరిక. రెండు వందలకు పైగా కుర్రవాళ్ళు, అమ్మాయిలు కూడా ఉన్నారు. అందరూ కాలేజీల్లో చదివేవాళ్ళే. పల్లెలనుంచి చాలా మంది వచ్చారు. లుంగీలు, భుజంపై కండువా, సినిమాల్లో మనుషుల్లా ఉన్నారు. అరుపులు, కేకలు, పాటలు, డప్పులు లయబద్ధంగా మోగటం. యిది మన ‘‘ట్రేడిషనల్‌ ఫోక్‌ ఫార్మ్‌’’ అంటూ తమ్ముడు చెవిలో గొణిగాడు. నినాదాలు, పాటలు, డప్పుల దరువు, డాన్సులు, అదంతా కొత్తగా, ఇష్టంగా అనిపించింది. పల్లెల నుంచి వచ్చిన ఆడవాళ్ళు, బస్తాల్లో మోసుకొచ్చిన సెనక్కాయలు (వేయించినవి), బెల్లం ముక్కలు పిల్లలకు పంచుతున్నారు. రూమీ (తమ్ముడు) నేను పక్కపక్కనే నిలబడ్డాము. తమ్ముడు చాలా ఉద్రేకంగా ఉన్నాడు. వాణ్ణి ఎప్పుడూ అలా చూడలేదు నేను. ‘‘మమ్మల్ని విభజించండి, ఇప్పుడే, ఇక్కడే’’ అనే ప్లకార్డు వాడి చేతిలో ఉంది. పూనకం వచ్చినవాడిలా అరుస్తూ, ‘‘రూమీ నువ్వేనా, నువ్వేనా’’ అని చాలాసార్లు అనుకున్నాను నేను. గుంపు మధ్యలోంచి ‘పాడె’ పైకి లేచింది. ఎవరిదో నాయకుడి దిష్టిబొమ్మ. అందరూ దుఃఖాన్ని అభినయిస్తూ, ‘‘ఓరినాయనోయ్‌’’ అని ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ, ‘‘నువ్వూ ఏడువ్వే’’ తమ్ముడు నన్ను చేతుల్తో పొడిచాడు. నాకు నవ్వు వస్తోంది. ‘‘వెళ్ళిపోయాడు నాయనో’’ అంటూ. గాడ్‌, నేనేనా, ఎంత ఎంజాయ్‌ చేశానో, గొప్ప సాయం కాలం ఇది. ఇంత ఉత్సాహంగా, ఆనందంగా సాగిన సాయంకాలాలు, ఈ మధ్యకాలంలో ఎప్పుడూ నా జీవితంలో రాలేదు.నేను ప్రత్యేకంగా గుర్తుంచుకునే రోజు ఇది. సన్నటి జల్లు పడుతోంది గానీ, ఆకాశంలో జేగురు రంగు మంటలా సూర్యుడు నిప్పుల్ని చల్లటం, ఇలా వానా ఎండా కలిసి వచ్చే సమయాలు ఎంతో ఆనందాన్నిచ్చేవి చిన్నప్పుడు. పిల్లలందరం కలిసి పెద్దగా అరుచుకుంటూ, వానా వానా వల్లప్పా అంటూ పాటలు పాడుకుంటూ, ఒకవైపు చెమట, మరోవైపు పైనుంచి వాన, అట్లా తడుచుకుంటూనే అంబేద్కర్‌ జంక్షన్‌ వైపుకు పరిగెత్తాను. లాస్ట్‌ పీరియడ్‌ ఎగ్గొట్టి, కాలేజీ బ్యాగ్‌లో దాచుకున్న ప్లకార్డును బయటకు తీశాను ‘దండోరా, మనకొత్త వెలుగు’. ప్లకార్డును పైకెత్తి పట్టుకున్నాను. ఈ కొత్త అనుభవం అద్భుతంగా ఉంది. జూన్‌ నెల. ఉక్కపోతగా ఉంది. రాత్రి తమ్ముడు చెప్పాడు, రేపు సాయంత్రం అంబేద్కర్‌ సెంటర్‌లో ఊరేగింపు ఉందని. ‘దండోరా’ అంటే ఏమిటని అమాయకంగా అడిగాను. చాలాసేపు వివరించాడు. కొంత అర్థమైంది. కొంత కాలేదు. కానీ ఇది నాన్నకు ఇష్టంలేదన్న విషయం మాత్రం అర్థమైంది. భయం, వణుకు, అంతలోనే తిరుగుబాటు చెయ్యాలనే తీవ్రమైన కోరిక. రెండు వందలకు పైగా కుర్రవాళ్ళు, అమ్మాయిలు కూడా ఉన్నారు. అందరూ కాలేజీల్లో చదివేవాళ్ళే. పల్లెలనుంచి చాలా మంది వచ్చారు. లుంగీలు, భుజంపై కండువా, సినిమాల్లో మనుషుల్లా ఉన్నారు. అరుపులు, కేకలు, పాటలు, డప్పులు లయబద్ధంగా మోగటం. యిది మన ‘‘ట్రేడిషనల్‌ ఫోక్‌ ఫార్మ్‌’’ అంటూ తమ్ముడు చెవిలో గొణిగాడు. నినాదాలు, పాటలు, డప్పుల దరువు, డాన్సులు, అదంతా కొత్తగా, ఇష్టంగా అనిపించింది. పల్లెల నుంచి వచ్చిన ఆడవాళ్ళు, బస్తాల్లో మోసుకొచ్చిన సెనక్కాయలు (వేయించినవి), బెల్లం ముక్కలు పిల్లలకు పంచుతున్నారు. రూమీ (తమ్ముడు) నేను పక్కపక్కనే నిలబడ్డాము. తమ్ముడు చాలా ఉద్రేకంగా ఉన్నాడు. వాణ్ణి ఎప్పుడూ అలా చూడలేదు నేను. ‘‘మమ్మల్ని విభజించండి, ఇప్పుడే, ఇక్కడే’’ అనే ప్లకార్డు వాడి చేతిలో ఉంది. పూనకం వచ్చినవాడిలా అరుస్తూ, ‘‘రూమీ నువ్వేనా, నువ్వేనా’’ అని చాలాసార్లు అనుకున్నాను నేను. గుంపు మధ్యలోంచి ‘పాడె’ పైకి లేచింది. ఎవరిదో నాయకుడి దిష్టిబొమ్మ. అందరూ దుఃఖాన్ని అభినయిస్తూ, ‘‘ఓరినాయనోయ్‌’’ అని ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ, ‘‘నువ్వూ ఏడువ్వే’’ తమ్ముడు నన్ను చేతుల్తో పొడిచాడు. నాకు నవ్వు వస్తోంది. ‘‘వెళ్ళిపోయాడు నాయనో’’ అంటూ. గాడ్‌, నేనేనా, ఎంత ఎంజాయ్‌ చేశానో, గొప్ప సాయం కాలం ఇది. ఇంత ఉత్సాహంగా, ఆనందంగా సాగిన సాయంకాలాలు, ఈ మధ్యకాలంలో ఎప్పుడూ నా జీవితంలో రాలేదు.