ఇంట్లో ఎవరూ లేరా? బయట నిలబడి గట్టిగా పిలిచాడతడు. అక్కడ అమ్మ లేదా? లోపలినించి తియ్యటి స్వరం వినిపించింది. . ఇక్కడెవరూ లేరే? లోపల నువ్వేం చేస్తున్నావ్‌? మళ్ళీ ప్రశ్నించాడతను. స్నానం చేస్తున్నా. మళ్ళీ సమాధానమచ్చింది తియ్యనిగొంతు. అతడు ఒక్కసారిగా ఉలికిపడ్డాడు. ఆమె నగ్న సౌందర్యాన్ని, యవ్వనం పొంగుల్ని కళ్ళముందు ఊహించుకున్నాడతను. ఆగలేక పిల్లిలా లోనికెళ్ళి బాత్రూం డోర్‌ దగ్గర వంగి నిలబడి....

సౌత్‌ఢిల్లీలో రింగ్‌రోడ్‌ ప్రాంతం.నైట్‌షిఫ్ట్‌ కార్మికులు ఫ్యాక్టరీనుంచి ఇళ్ళకు వెళ్ళుతున్నారు. ఫ్యాక్టరీకి వెళుతూ తమకు ఎదురుపడిన డే షిఫ్ట్‌ కార్మికమిత్రుల్ని నవ్వుతూ పలకరిస్తున్నారు. అలా వెళుతున్న ఓ కార్మికుడికళ్ళు హఠాత్తుగా దారిపక్కనున్న ఓ పొదమీదపడ్డాయి.మాసిపీలికలైన దుస్తుల్లో ఉన్న ఓ శవం కనిపించింది. శవంలో ముప్పాతికభాగం అస్థిపంజరంగా మారింది. ఓ కుక్క ఆ చేయిపట్టి లాగుతుంటే, అస్థిపంజరం కార్మికుడి కంటపడింది.ఆ దృశ్యాన్ని తన మిత్రులకుకూడా చూపించాడు ఆ కార్మికుడు. వాళ్ళల్లో ఒకడు వెంటనే ఆ విషయం పోలీసులకు తెలియజేశాడు. సమాచారం అందుకున్న ‘వికాసపురి’ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ సింగ్‌ తన సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకున్నాడు.

గబగబా పొదదగ్గరకెళ్ళి ముళ్ళపొదలో ఉన్న అస్థిపంజరాన్ని చూశాడు.దుస్తుల్ని జాగ్రత్తగా గమనించి, అది ఆడపిల్లస్కర్ట్‌గా గుర్తించాడు. స్కర్ట్‌ అడుగున చిరిగిపోయిన బ్రా కూడా కనిపించింది. ఫోరెన్సిక్‌ డిపార్ట్‌మెంట్‌ సహాయంలేనిదే కేసు ముందుకుసాగదని గ్రహించాడు. వెంటనే పోలీస్‌ ఫొటోగ్రాఫర్‌నిపిలిచి ఫొటోలు తీయించి, అస్థిపంజరాన్ని ఫోరెన్సిక్‌ల్యాబ్‌కు తరలించారు. దానికంటే ముందు సిబ్బంది అందరూ ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా గాలించారు. రెండుమూడునెల్లక్రితంనాటి మిస్సింగ్‌కేసుల రిజిస్టర్‌ బయటకుతీయమని అసిస్టెంట్లకు పురమాయించాడు ఇన్‌స్పెక్టర్‌ సింగ్‌. అంతలో ఫోరెన్సిక్‌ నివేదికకూడా వచ్చింది. హతురాలు 15– 18ఏళ్ళ మధ్యవయస్కురాలై ఉంటుందనీ, హత్యకుముందు ఆమెపై అత్యాచారం జరిగిందనీ నివేదిక పేర్కొంది.

ఆమె స్కర్ట్‌మీద ఉన్న స్పెర్మ్‌గుర్తుల్నిబట్టి సామూహిక లైంగికదాడి చేశారనీ, మెడ ఎముక విరిచి చంపారని తేలింది. రిపోర్టు చదువుతుండగా అసిస్టెంట్‌ ఒకరు మిస్సింగ్ కేసుల ఫైల్‌తెచ్చి సింగ్‌ ముందుపెట్టాడు. రెండున్నరనెలల క్రితం అంటే ఆగస్టు 16న తమ కూతురు పుష్ప కనిపించటంలేదని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదొకటి అతడికి కనిపించింది అతడికి. వెంటనే వాళ్ళను స్టేషన్‌కు పిలిపించాడు. అస్థిపంజరంమీద దొరికిన స్కర్ట్‌ తెప్పించి వాళ్ళకు చూపించాడు. దాన్ని చూడగానే పుష్పతల్లి గుండెలు పగిలేలా ఏడ్వసాగింది. పుష్పతండ్రి రెండుచేతుల్లో ముఖందాచుకుని రోదించసాగాడు.