అనుపమకి పాస్‌ పోర్టు వచ్చింది...కానీ ఆమె ఇద్దరు పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది. భర్తకి కూడాసమాచారం లేదు ఎక్కడుందో. ఢిల్లీ వెళ్లిందని పిల్లలకి తెలిసింది.ఢిల్లీ తీసికెళ్ళమని పిల్లలు తండ్రితో గొడవపడుతున్నారు.‘‘యూఎస్‌ కెళ్ళుంటుందిలే వాడి దగ్గరికి’’ అని మనసులోఅనుకుని పైకి మాత్రం ఊరుకో బెడుతున్నాడు పిల్లల్ని.‘‘యూఎస్‌లో నాకెవడో వుంటే, కోల్‌కతాలోనీకు అది లేదా?’’ అని ఎన్నోసార్లుగొడవపడింది అనుపమ.

ఇప్పుడు డెహ్రాడూన్‌లో ముసోరీ వెళ్ళే రోడ్డుమీద ఎక్కడెక్కడ తప్పిపోయిందో...పాస్‌ పోర్టు వచ్చి వారం దాటుతోంది.ఫ ఫ ఫడెహ్రాడూన్‌ - ముసోరీ రోడ్డు మీద పోతున్నాడు రాజేష్‌ డఫెల్‌ బ్యాగు పట్టుకుని. పిల్లల్ని తల్చుకుంటే కన్నీళ్ళాగడం లేదు. యూఎస్‌లో కవలలు పుట్టారు. వాళ్ళని చూసైనా మారుతుందనుకుంటే అదీ జరగలేదు. జాబ్‌ ఇప్పించాలని ఇంకా గొడవ. ఆమెకున్న వీసాకి జాబ్‌ రాదనీ ఎంత చెప్పినా వినలేదు. అంతలో మెత్తగా ప్రవర్తిస్తూంటే ఏమిటా అని కనిపెట్టాడు. తన ఫ్రెండ్‌తోనే ఎఫైర్‌ పెట్టుకుంది?‘ ఔను, ఎవరు జాబ్‌ ఇప్పిస్తే వాళ్లతో ఉంటా!’ అనేసింది తెగించి.

పకపకా నవ్వాడు.‘‘ఎందుకా నవ్వు?’’ అని అడిగింది.‘‘ఎందుకా? నా జాబ్‌కే దిక్కులేదు, రిసెషన్‌ లో పీకేశారు! సాఫ్ట్‌వేర్‌ కొంప మునిగింది. ఈ ఫ్లాట్‌ అమ్మేస్తున్నా. మనం కోల్‌కతా వెళ్ళిపోతున్నాం పద!’’ అని ఎదురు షాకిచ్చాడు.ముసోరీ రోడ్డు మీద పోతూంటే ముసురుకుంటున్న ఆలోచనలన్నీ ముళ్ళలా గుచ్చుకుంటున్నాయి రాజేష్‌కి.కోల్‌కతాలో పెళ్ళయి, ఒక కొడుకున్నామెని తను రహస్యంగా పెళ్లి చేసుకున్నమాట నిజమే. కానీ ఆ కొడుకు వల్ల ఆమెతో సుఖపడిందీ లేదు. ఇంతలో ఆమె మొగుడు తిరిగిరావడంతో పారిపోయి డెహ్రాడూన్‌ వచ్చేశాడు. మళ్ళీ ఇక్కడ జాబ్‌ చూసుకున్నాడు.

అనుపమకి సంగతి తెలిసి గొడవచేస్తే, ‘‘ఔను, పెళ్లి చేసుకున్నా, నువ్వు వాణ్ణి చేసుకున్నావా - అదీ నీకూ నాకూ డిఫరెన్స్‌!’’ అని లాజిక్‌ తీశాడు.‘‘పెళ్ళయి మొగుడున్నదాన్ని పెళ్లి చేసుకుంటే దాన్నేమంటారు?’’ అని చొక్కా పట్టేసుకుంది. తను ఆమె జుట్టు పట్టుకున్నాడు. ఓ యుద్ధంలాంటి వాతావరణం. ఆలోచనల్లోంచి బాధగా తేరుకుని, రోడ్డు మీద అటూ ఇటూ చూశాడు రాజేష్‌. డఫెల్‌ బ్యాగు ఓపెన్‌ చేశాడు. అందులోంచి చిన్నగా తీశాడు దాన్ని ...