చెన్నై శివారు, మెడిచ్చూరు.జూన్‌ 16, 2016 రాత్రి...చీకట్లో ముగ్గురూపొలాల్లో కూర్చుని గొడవపడుతున్నారు.‘‘ఎన్నా అన్నా, ఇదు ఎన్నా అన్నా?...అవళ్‌ ఎణక్కు కటుత్తల్‌...’’‘‘ఏయ్‌, వాహిముడే! వాహిముడే!!....’’మాణిక్యం, కిషోర్‌, రాజా ముగ్గురూ గొడవ పడుతూనే సీసాలు ఖాళీ చేస్తున్నారు. దీనికి సరిగ్గా ఏడాదిముందు...

జూన్‌ 15, 2015న కరూర్‌ జిల్లా వెల్లియనై పోలీస్‌ స్టేషన్‌.భార్య కన్పించడం లేదని కంప్లైంట్‌ ఇచ్చేందుకు వచ్చాడు ఇళయరాజా.‘పేరు?’‘పర్వీన్‌ బాను’‘ఏమైంది?’‘ఏమో సార్‌! కొట్లాడి ఇంట్లోంచి వెళ్ళిపోయింది’‘ఫోటో, ఫోన్‌ నెంబర్‌ ఇచ్చి వెళ్ళు’అడిగిన వివరాలన్నీ ఇచ్చి వెళ్ళాడు ఇళయరాజా.పర్వీన్‌ బానూ, ఇళయరాజాలది ప్రేమ పెళ్లి. ఇద్దరు పిల్లలు. అయినా బానూకి కోరికలు ఎక్కువ. భర్తతో చీటికీ మాటికీ కొట్లాడుతూ ఉండేది. వాళ్లింట్లో ఎప్పుడూ గొడవలే! ఈసారి ఇంట్లోంచే వెళ్ళిపోయింది... అని చుట్టుపక్కలవాళ్లు చెప్పారు. ఆమె సెల్‌ఫోన్‌ని ట్రాక్‌ చేశారు పోలీసులు. చెన్నై చేరుకుందని తెలిసింది. ఎక్కడుందో పక్కాగా తెలుసుకుందామని, చెన్నై పోలీసులు లొకేషన్‌ను ట్రాక్‌ చేస్తూంటే ఉన్నట్టుండి సెల్‌ స్విచ్ఛాఫ్‌ అయింది. మళ్ళీ సిగ్నల్స్‌ దొరకలేదు. నెలలు గడిచిపోయాయి.

భర్తకి కూడా ఆమె కాల్‌ చేయలేదు. మంచి చీర, జాకెట్టు, తలలో పూలు, కాళ్ళకి హై హీల్సు, చేతిలో హ్యాండ్‌ బ్యాగుతో చెన్నైలో షికారు చేస్తోంది పర్వీన్‌ బాను. డబ్బులు బాగానే వస్తున్నాయి. భర్తకి దొరక్కూడదని సెల్‌ ఆఫ్‌ చేసి ఓ మూలన పడేసింది. ఈ షికార్లతో మొదట కోయంబత్తూరు రాజా పరిచయమయ్యాడు. అతను మాణిక్యం, కిషోర్‌లని పరిచయం చేశాడు. ఈ పరిచయాలతో ఆమె బిజీగా మారింది. ముగ్గురూ ఆమె ఇంటికే రాకపోకలు సాగించేవారు.‘సామాన్లు బాగానే కొంటోంది, బంగారం కూడా కొనుంటుందా?’‘కొనే వుంటుంది, దాచి పెట్టుకుని వుంటుంది’‘పోన్లేరా, అంతకంటే ఎక్కువే ఇస్తోందిగా’‘‘అదిచ్చేది నువ్వు పుచ్చుకో, మేం తీసుకునేది మేం తీసుకుంటాం...’ముగ్గురి మధ్యా రహస్య చర్చ.

అటు భర్త పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ‘‘ఇంకేం దొరుకుతుందయ్యా ఏడాది కావొస్తూంటే...’’ అని పోలీసులు విసుక్కో సాగారు.‘‘ఆ సెల్‌ఫోన్ని కనిపెట్టే మార్గమే లేదా? సార్‌’’ అని ఇళయరాజా పోలీసులను వేడుకోసాగాడు.