ఒక కత్తి, ఓ పిస్తోలు, కొన్ని తూటాలు, కిరోసిన్‌ బాటిల్‌... బ్యాగులో సర్దుకున్నాడతను. ఫోన్‌ చేసి, ‘‘వస్తున్నా!’’ అని చెప్పాడు. అవతలి వ్యక్తి పోలీస్‌ కంప్లెయింట్‌ ఇచ్చానని వ్యంగ్యంగా నవ్వాడు.

‘‘ఈ సారి జైలుకి పోతే ఇక బయటి ప్రపంచాన్ని చూడలేవు!’’ అని హెచ్చరించాడు. జైల్లోంచి వచ్చిందే జైలు కెళ్లడానికని, బ్యాగు భుజాన తగిలించు కున్నాడు 50 ఏళ్ల జయప్రకాష్‌ జైస్వాల్‌.ఫఫఫముంబయి ఉక్కపోతగా ఉంది... బస్సెక్కి పింప్రిపద బయల్దేరాడు. రాజ్‌కుమార్‌ ఎలక్ర్టికల్‌ షాపుకు ఎదురుగా ఉన్న స్టాపులో దిగాడు. మధ్యాహ్నం పూట ట్రాఫిక్‌ అంతగా లేదు. ఎదురుగా షాపు స్పష్టంగా కన్పిస్తోంది. కస్టమర్లతో రద్దీగా ఉంది. జోరుగా సాగుతున్న వ్యాపారాన్ని చూస్తూంటే కడుపు రగిలిపోతోంది. ‘‘ఎక్కడున్నావ్‌ రా?’’ అన్నాడు ఫోన్‌ చేసి. ‘‘వచ్చావా? సివిల్‌ డ్రెస్‌లో పోలీసులున్నారు బైట!’’ అవతల్నుంచి రాజ్‌కుమార్‌ జైస్వాల్‌ అన్నాడు.‘‘ఎందుకురా బుకాయిస్తావ్‌? ఇన్నిసార్లు ఫోన్లు చేస్తున్నా నన్ను ట్రాక్‌ చేసి పట్టుకున్నారా? పోలీస్‌ కంప్లెయింటా నీ మొహానికి!’’‘‘షాపులోకి రారా నువ్వు, తెలుస్తుంది!’’ అని కట్‌ చేశాడు. అయోమయంలో పడ్డాడు.

అసలు వీడు షాపులోనే ఉన్నాడా అని గబగబా వెళ్ళాడు...ఫఫఫబార్లో బాగా తాగేస్తూ, ‘‘సీసీ కెమెరా ఆఫ్‌ చెయ్‌, మర్డర్‌ చేసొచ్చా!’’ అన్నాడు బాయ్‌తో. బాయ్‌ పట్టించుకోలేదు. ఇంకో బీరు తెమ్మన్నాడు. ఇప్పటికే ఓవరయ్యావ్‌, బిల్లు కట్టేసి పొమ్మన్నాడు బాయ్‌. జయప్రకాష్‌, రాజ్‌కుమార్‌కి కాల్‌ చేసి, ‘‘నువ్వు పోలీసుల్ని పెట్టుకున్నా, సీసీ కెమెరాలు పెట్టుకున్నా, నీ చావు ఖాయం. పిస్తోలుతో కాకపోతే కత్తితో! కత్తితో కాకపోతే పెట్రోల్‌ బాంబుతో’’ అన్నాడు. అవతల రాజ్‌కుమార్‌ మాట్లాడలేదు.‘‘ఉన్నావా, పోయావా? ఔను, లేపేశా కదా!’’ అనుకున్నాడు తృప్తిగా ఫోన్‌ కట్‌ చేస్తూ. ఆ రాత్రి మొద్దు నిద్రపోయాడు జయప్రకాష్‌. ఉదయం పదకొండు గంటలకి కంగారుగా లేచి, ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి, బ్యాగు తగిలించుకుని బయల్దేరాడు బైకుల్లాలో బస చేసిన గది నుంచి.రైల్వే టికెట్‌ బుక్‌ చేసుకుని, అటూఇటూ తిరుగుతూ పనులు ముగించుకోసాగాడు. బార్లో బీరు తాగుతూ టీవీ చూశాడు. తన న్యూస్‌ కూడా రావాలి, వస్తుంది. అప్పటికి యూపీలో ఉంటాడు.