ఆ స్టీలు స్ర్కూనే పరిశీలిస్తూ కూర్చున్నాడుఇన్‌స్పెక్టర్‌ శిబి టామ్‌. ఇది ఎక్కడ్నించి వచ్చిందీ,ఎవరికి చేరిందీ మిస్టరీగా ఉంది. కేసులో ఇదొక్కటే క్లూ!పై అధికారులు చాలామంది ఇన్వాల్వ్‌ అయివున్నారీ అసాధారణ కేసు దర్యాప్తులో. అందరి ప్రశ్నా ఒక్కటే- ఈ స్ర్కూ ఇస్తున్న క్లూ ఏమిటి? దీని సొంతదారు ఎవరు?

‘‘సర్‌, దాని మీద బ్రాండ్‌ నేమ్‌ని బట్టి అది పుణేలోని యూనిట్‌లో తయారైంది...’’ అని టీం మెంబర్స్‌ చెప్తూంటే, ‘‘ఓకే, బ్యాచ్‌ నెంబర్‌ కూడా ఉంది దీని మీద... ఆ యూనిట్‌ నుంచి ఇదెక్కడికి చేరిందీ తెలుసుకోండి వెంటనే!’’ అన్నాడు శిబి టామ్‌. ఆర్థోపీడిక్‌ పరికరాల ఉత్పత్తిదారు పిట్కార్‌ ఏజెన్సీ, కొచ్చిలో ఉన్నట్టు తెలుసుకుని అక్కడికి వెళ్ళిపోయారు టీం మెంబర్స్‌. ‘‘ఈ బ్యాచ్‌ నెంబర్‌ స్ర్కూలని కేరళ అంతటా మూడొందల సర్జరీల్లో వాడారు సర్‌. కొచ్చిలోనే ఆరు సర్జరీల్లో వాడారు...’’ చెప్పాడు ఏజెన్సీ అతను.‘‘ఏం సర్జరీలవి?’’‘‘కాలు చీలమండ ఫ్రాక్చరయితే చేసే సర్జరీలు. ఈ స్ర్కూలు విరిగిన ఎముకని అతికించడానికి వాడతారు. ఎడమ కాలి చీలమండకి వాడిన స్ర్కూ ఇది. ఎక్కడ దొరికింది మీకు?’’‘‘ముందు కొచ్చిలో హాస్పిటల్స్‌ వివరాలివ్వండి!’’ఒకటే హాస్పిటల్‌. అక్కడికెళ్ళి, సర్జరీ చేయించుకున్న పేషెంట్ల వివరాలు తీసుకున్నారు.

ఆరుగురు పేషెంట్లు... అడ్రసుల ప్రకారం ఒక్కొక్కర్నీ గాలించి పట్టుకోసాగారు. ఐదుగురు పేషెంట్లు క్షేమంగానే ఉన్నారు - ఆరో పేషెంట్‌ ముంబయి వెళ్లినట్టు తెలిసింది. ‘‘ఎవరా పేషెంట్‌?’’ అడిగాడు శిబి టామ్‌.‘‘శకుంతల అట సర్‌’’‘‘డిస్పాచ్‌ అవండి ముంబయికి మరి!’’ఫఫఫముంబయి నుంచి డీలాపడి వచ్చారు రెండు వారాల అన్వేషణ తర్వాత, ‘‘రాంగ్‌ లీడ్‌ సర్‌, ఆమె అక్కడ లేదు. కూతురే ఇక్కడుందని తెలిసింది...’’‘‘పట్రండి’’రెండ్రోజులు వెతికి తీసుకొచ్చారు. పాతికేళ్లుంటాయి ఆశ్వతికి. ఆమెకి డీఎన్‌ఏ పరీక్ష జరిపించి శకుంతల కూతురేనని నిర్ధారించుకున్నారు.‘‘చూడమ్మా, రెండేళ్లుగా మీ అమ్మ కన్పించడం లేదని తెలిసి కూడా ఎందుకు కంప్లైంట్‌ ఇవ్వలేదు?’’ అడిగాడు శిబిటామ్‌.‘‘ఆమెకు దూరంగా ఉంటున్నాను’’‘‘ఎందుకు?’’‘‘సజిత్‌ అంటే ఆమెకిష్టం లేదు’’‘‘సజిత్‌ ఎవరు?’’