నిటారుగా దిష్టి బొమ్మలా వుంది బ్రిడ్జి మీద డమ్మీ. దాన్నిఒక్క తోపు తోశారు క్రైం బ్రాంచ్‌ పోలీసులు. కింద మురుగునీట్లో పడి మునుగుతూ తేలుతూ పోతోంది యువతిని పోలిన డమ్మీ.వెళ్లి వెళ్లి ఆగిపోయింది పొదల్లో ఇరుక్కుని. 

తలపట్టుకుని, పైఅధికారులకి కాల్‌ చేశారు? ‘నీటి లోతు, వేగం, గాలి దిశా హత్యజరిగిన నాటి పరిస్థితులతో లేవు. పరిస్థితి అనుకూలించగానేశవం ఎటు కొట్టుకు పోయిందో మరోసారి ప్రయత్నించిచూస్తాం’ అని మీడియాకి ప్రకటించాడు జాయింట్‌కమిషనర్‌ (క్రైమ్స్‌) సంజయ్‌ సక్సేనా.ముంబయి మహుల్‌ వాడాలా ఐమాక్స్‌ థియేటర్‌ వెనకాల నాలాలో పడ్డ శవం సముద్రపు ఆటుపోట్లకి ఏమైందో వారం నుంచీ జాడలేదు. కిలో మీటర్ల పొడవున్న నాలా ఇరువైపులా దట్టంగా పెరిగిన చెట్లూ గుబురు పొదలూ గాలింపు చర్యల్ని చికాకు పెడుతున్నాయి. గజ ఈతగాళ్ళనీ, జాలరుల్నీ రప్పించి, యంత్ర పరికరాలూ తెప్పించి, రోజుకి పాతిక వేల చొప్పున ఖర్చు పెడుతూ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.

చిట్టడవి లాంటి ఆ ప్రాంతంలో నక్కలు, కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ఎముకలు దొరికితే అవి పరీక్షలో జంతు ఎముకలని తేలింది. ఆ గాలింపు చర్యలకి అంతూపొంతూ లేకుండా పోతోంది.ఫ ఫ ఫకారాగి వుంది అంథేరీలో ఒక చోట. అపార్ట్‌మెంట్‌లోంచి ఒక ఇరవై ఎనిమిదేళ్ళ యువతి ఠీవిగా వస్తోంది. ఆమె పక్కకొచ్చి ఆగింది కారు. వాళ్ళని గుర్తుపట్టి కారెక్కిందామె. కారులో అతను, ఆమె వున్నారు. అతను డిస్మిసల్‌ ఆర్డర్‌ని ఆపమన్నాడు. ‘ఎందుకాపుతాను? నీకుద్యోగమే చేతకాదు’ అందా యువతి. మాటా మాటా పెరిగింది. రెచ్చిపోయి అతను కర్చీఫ్‌ బిగించి ఆ యువతి ప్రాణాలు తీసేశాడు.

ముందు సీట్లోంచి వెనుక సీట్లోకి, వెనుక సీట్లోంచి డిక్కీలోకీ తోసేశారు శవాన్ని అతనూ ఆమే కలిసి.ఫ ఫ ఫ4కే హై రిజల్యూషన్‌ కెమెరాలమర్చిన డ్రోన్స్‌తో గాలిస్తున్నారు శవాన్ని. నెల దాటి పోయింది. మరో వైపు నాలాలో కొట్టుకొచ్చిన లెక్కలేనన్ని దుస్తులు, చెప్పులు కూడా పోగేసి పరిశీలన మొదలెట్టారు. ఆమె మొబైల్‌, హ్యాండ్‌ బ్యాగు, టిఫిన్‌ బ్యాగు కూడా దొరకడం లేదు. పొక్లెయిన్‌లని తెప్పించి భారీ ఎత్తున తవ్వకాలు సాగించారు. డీఎన్‌ఏ సాక్ష్యం కోసం చిన్న ఎముక, మాంసపు ముక్క కూడా జాడ లేదు.