పతనానికి ప్రతీక

క్రౌర్యం - వెకిలితనం - వంచన - మోసం... కలగలిపిన పాత్రలను మన కళ్ల లోగిళ్లలోకి వదులుతున్నాయి కొన్ని ధారావాహికలు! వీటి ప్రభావంతో మనసును మకిలిపరుచుకునేవారు ఎందరో! ఈ ఆవేదనకు, భయానికి అక్షర రూపం ఇచ్చిన వ్యంగ్య కథల సంకలనం ఇది. దుష్టిత, నీచిత, పాపిత, జిత్తు, మదిత, వన్నెల, పిల్ల రాక్షసి లాంటి పేర్లతో సీరియళ్ల నాయికల మీద వ్యంగ్య బాణాలు సంధించారు రచయిత్రి. ఆ పేర్లకు తగినట్టుగా, వారి స్వరూప స్వభావాలను చిత్రిస్తూ, బుల్లితెర సాక్షిగా సా...గుతున్న మేధోపతనాన్ని కళ్లకు కడతాయి. వీటిని చదివితే కొందరిలో అయినా మార్పు రావచ్చు.

- వల్లూరి రాఘవరావు

 

అష్టావక్ర నాయికలు, 

రచన : అత్తలూరి విజయలక్ష్మి

పేజీలు: 143, వెల : రూ.120, 

ప్రతులకు : విశాలాంధ్ర బుక్‌ హౌస్‌