మార్క్స్‌ చెప్పిన మాట

 

ఇప్పటికీ శ్రమవిభజన, వర్గపోరాటం, అదనపు విలువ వంటి అంశాల మీద అవగాహన కల గాలంటే... కార్ల్‌ మార్క్స్‌ ‘కాపిటల్‌’ను మించిన రచన లేదు. అందుకే దాన్ని వీలైనంత సులువుగా,  స్థానిక భాషల్లో అందించాలని కృషి చేస్తుంటారు. అలాంటి మరో యత్నమే ఇది.కేపిటల్‌ గ్రంథంలో ఎనిమిది అధ్యాయాలను... పాఠకులకు చేరువ చేసే ప్రయత్నం కనిపిస్తుంది. అనువాదకుడు క్లిష్టమైన చోట్ల ఉదాహరణలు అందిస్తూ, తనవైన అభిప్రాయాలను పంచుకుంటూ.... పుస్తకాన్ని నడిపించారు. ఆర్థికం, సామాజికం, రాజకీయం... ఏ రంగానికి చెందిన వారికైనా మార్క్సిజం గురించి మౌలిక విషయాలను పరిచయం చేస్తుంది.

 

కాపిటల్‌లో కార్ల్‌ మార్క్స్‌ ఏం చెప్పాడు

అనువాదం: ఇ.ఎస్‌. బ్రహ్మాచారి,

 పేజీలు: 400, వెల: రూ. 200

ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్‌, నవతెలంగాణ