ఆచారం, ఆధుని‘కథ’ కలిసిన ఆవాజ్‌...

రివాజు అంటే ఆచారం. ఆచార సంప్రదాయాలు గత కాలానికి చెందినవిగా కనిపించినా అవసరాలకు తగినట్లు మార్చుకుంటాం. 2018లో వచ్చిన తెలంగాణ కథల్లోంచి ఎంపిక చేసిన 13 కథల సంకలనం ‘రివాజు’లో కూడా సంప్రదాయం, కొత్తదనం కలిసి ప్రవహించాయి. ముదిగంటి సుజాతారెడ్డి, పెద్దింటి అశోక్‌ కుమార్‌ వంటి సీనియర్‌ కథకులతో పాటూ వంశీధర్‌ రెడ్డి, మేడి చైతన్య వంటి కొత్త కథకుల కథలూ ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటుకు పూర్వం పరిస్థితులు, ఏర్పాటు అనంతరమూ తప్పని పోరాటం... వీటిలో ప్రతిఫలిస్తుంది. వస్తు గాఢతతో పాటూ శిల్పపరం గానూ ఉన్నతమైన కథలు ఈ సంకలనంలో చోటు చేసుకున్నాయి.

- చందు తులసి

రివాజు - తెలంగాణ కథ 2018

సంపాదకులు: సంగిశెట్టి శ్రీనివాస్‌, వెల్దండి శ్రీధర్‌

పేజీలు: 132, వెల: రూ.70, ప్రతులకు: 98492 20321