కలియుగ వైకుంఠ వీక్షణం

తిరుమల చరిత్ర, స్థలపురాణాలు, అనేక తీర్థాలు, శ్రీవారి మహిమలు, ఆలయ వ్యవస్థ, స్వామి వారి ఉత్సవాలు, సేవలు.. వాటి విధానాలు, ఆంతర్యాలు, ఆభరణాలు, అలంకారాలు, భక్తుల సందేహాలు, వాటికి సమాధానాలు... విస్తృతమైన సమాచారంతో ఈ గ్రంథాన్ని సర్వ సమగ్రం చేశారు రచయిత. ఈశ్వరానుగ్రహానికి పాత్రుడైన సింహప్రసాద్‌ అభినందనీయులు. స్వామి పట్ల ఆరాధనా భావం, అనురక్తి, భక్తి మాత్రమే కాక, ప్రపత్తితో చేసిన ఈ సాహిత్యభరణం వెంకన్న భక్తుల పాలిటి ఒక వరం. అదివో శ్రీహరివాసము నుండి శ్రీనివాసాయ మంగళమ్‌ వరకు 62 భాగాలుగా విభజించి తిరుమల క్షేత్రాన్ని కళ్లముందు నిలిపిన గ్రంథం.

- విహారి

తిరుమల దివ్యక్షేత్రం (ఆధ్యాత్మిక పరిశోధన),

రచన: సింహప్రసాద్‌పేజీలు: 564, వెల: రూ. 450,

ప్రతులకు: 94948 75959, 90324 28516