హైదరాబాద్, బర్కతపుర: ఆంధ్రజ్యోతి నవ్య వారపత్రిక సంపాదకుడు ఏఎన్ జగన్నాథశర్మకు వేమూరి ఆంజనేయ శర్మ స్మారక అవార్డు(2016) లభిం చింది. తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు వేమూరి ఆంజనేయశర్మ స్మారక ట్రస్టు ప్రతి నిధులు వెల్లడించారు. మేనేజింగ్‌ ట్రస్టీ ప్రొఫెసర్‌ వేమూరి హరినాయణ శర్మ, ట్రస్టీలు ఎల్‌.ఎన్.శాస్త్రి, వి.విద్యానాథశాస్త్రి, వి.కృష్ణ మూర్తి, వేమూరి సుధాకర్‌ బుధవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘2004లో ఈ స్మారక ట్రస్టు ఏర్పాటైంది. తెలుగు సాహిత్యంలో విశేషకృషి చేసిన వారిని ఎంపి క చేసి ఏటా అవార్డులిస్తున్నాం. ఈ ఏడాది ఏఎన్ జగన్నాథశర్మను ఎంపిక చేశాం’ అని వారు చెప్పారు. హిందీ సాహిత్యంలో ప్రసిద్ధ కవి, సినీరచయిత డాక్టర్‌ దయాకృష్ణ గోయల్‌, నాటకరంగంలో సుప్రసిద్ధ కళాకారుడు, దర్శకుడు దుగ్గిరాల సోమేశ్వరరావును ఎంపిక చేశామని తెలిపారు. అవార్డు కింద 10వేల నగదు, జ్ఞాపికను అందజేస్తామన్నారు. ఈ సంవత్సరం హిందీ అభివృద్ధికి ఉత్తమ సేవలు అందిస్తున్న ఐదుగురిని ఎంపిక చేసి వారికి రూ.1116 నగదు, జ్ఞాపిక, శాలువతో సత్కరిస్తున్నట్టు వెల్లడించారు. ఈ అవార్డుల ప్రదానోత్సవం 10న రవీం ద్రభారతిలో జరుగనుందని తెలిపారు. వేమూరి ఆంజనేయ శర్మ శతజ యంతి ఉత్సవాల సందర్భంగా ఈ అవార్డులను అందజేస్తున్నట్టు వెల్లడించారు. ఏపీ శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ ముఖ్య అతిథిగా హాజరు కానుండగా.. కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత కె.శివారెడ్డి అధ్యక్షత వహిస్తారని వారు తెలిపారు.