విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో వారం రోజులపాటు నిర్వహణ

వివిధ ప్రాంతాల నుంచి తరలిరానున్న సంగీత విద్వాంసులు
రోజూ మధ్యాహ్నం ఔత్సాహికులతో త్యాగరాయ సంకీర్తనలు 

హైదరాబాద్‌ సిటీ, జనవరి10 (ఆంధ్రజ్యోతి):సంగీత స్వరాలు.. మృదంగ వాయిద్యాలు.. త్యాగరాయ సంకీర్తనలు.. ఒకే వేదికపై అలరించనున్నాయి. ఇందుకు నగరంలోని ఖైరతాబాద్‌ ఆనంద్‌నగర్‌ కమ్యూనిటీహాల్‌ వేదిక కానుంది. ఖైరతాబాద్‌లోని విజ్ఞాన సమితి సంస్థ 43వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకు 173వ త్యాగరాయ ఆరాధనోత్సవాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు విజ్ఞాన సమితి సంస్థ అధ్యక్షుడు సూరి వెంకటేశ్వర్లు, సెక్రటరీ వీవీ సుగ్నన్‌ ఆధ్వర్యంలో వేడుకల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సంస్థ సభ్యులు చురుగ్గా చేస్తున్నారు. నగరంలో అత్యం త వైభవంగా నిర్వహించే వేడుకలకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.
 
7 రోజులు.. 16 కచేరీలు..
వారం రోజులపాటు జరిగే త్యాగరాయ ఆరాధనోత్సవాల్లో భాగంగా మొత్తం 16 కచేరీలను నిర్వహించనున్నారు. వేద వేదాంత, సంగీత, సాహిత్య, ప్రచార సభ నినాదంతో నిర్వహించనున్న ఉత్సవంలో దేశంలోని మహారాష్ట్ర, కేరళ, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌, తిరుపతి తదితర ప్రాం తాలకు చెందిన పేరొందిన సంగీత విద్వాంసులు తరలివచ్చి ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు సూరి వెంకటేశ్వర్లు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఔత్సాహిక విద్వాంసులైన పిల్ల లు, పెద్దలు, మహిళలు ప్రదర్శనలు ఇస్తారని తెలిపారు. ఇప్పటి వరకు విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో 42 ఉత్సవాలు నిర్వహించామని,  ప్రస్తుతం 43వ వేడుకను నిర్వహిస్తున్నామన్నారు. కాగా, వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న సంగీత విద్వాంసులకు ప్రయాణ చార్జీలు ఇస్తున్నామని చెప్పారు. వారం రోజులపాటు జరిగే వేడుకల్లో వేద పండితులకు సన్మానం చేస్తామన్నారు. 
 
వేడుకల్లో కొన్ని కార్యక్రమాలు..
15న ఉదయం 8.30 గంటలకు ఖైరతాబాద్‌లోని ఆనంద్‌నగర్‌ కమ్యూనిటీ హాల్‌లో వేడుకలు ప్రారంభమవుతాయి. ఉదయం 9 గంటలకు పాములేటి నరసింహం బృందం ఆధ్వర్యంలో నాదస్వరం, 9.30 గంటలకు వేదిక్‌ స్కాలర్స్‌ ఆధ్వర్యంలో వేద ప్రదర్శన, 10.30 గంటలకు సంగీత విజ్ఞాన విశారద, 11.30 గంటలకు గోష్టి గానం లాంటి ప్రధాన కార్యక్రమాలుంటాయి. అలాగే వక్తల ప్రసంగాలు, చిన్న చిన్న ప్రదర్శనలుంటాయి. 16న సాయంత్రం 6 గంటలకు క్రాంతి కిరణ్‌ బృందం ఆధ్వర్యంలో నాట్యాచార్య ప్రదర్శన, 17న సాయంత్రం 6 గంటలకు చెన్నయ్‌కి చెందిన మాస్టర్‌ సాయిగోవింద్‌-మండోలిన్‌, ఎన్‌సీ అనంతకృష్ణ-వయోలిన్‌, టీపీ బాలసుబ్రహ్మణ్యం-మృదంగం ప్రదర్శన ఉంటుంది. 18న సాయంత్రం 6 గంటలకు ఆర్‌.సుధాకర్‌-వీణ, జి.ఓంప్రకా్‌ష-మృదంగం, చంద్రకాంత్‌-ఘటం ప్రదర్శన, 19న ఉదయం 10.30 గంటలకు కుప్ప శారద-వోకల్‌, శివకృష్ణ స్వరూ్‌ప-వయోలిన్‌, శ్రీనివా్‌సరావు-మృదంగం, రాత్రి 7.15 గంటలకు సంగీత క్షీరసాగరం, సప్తపర్ణి, 20న రాత్రి 7.15 గంటలకు చెన్నయ్‌కి చెందిన వేణుగాన శిరోమణి సిక్కిమాల చంద్రశేఖర్‌-ఫ్లూట్‌ ప్రదర్శన, యూఎ్‌సఏకి చెందిన మల్లజ్యోస్యుల శ్రీకాంత్‌-వయోలిన్‌, పేరావలి జయభాస్కర్‌- మృదంగం, హన్మంతరావు-ఘటం, డాక్టర్‌ ఘంటసాల సత్యసాయి-మోర్సింగ్‌ ప్రదర్శన, 21న విజయవాడకు చెందిన మోడుముడి సుధాకర్‌-స్వర ప్రదర్శన, ద్వారం సత్యనారాయణరావు-వయోలిన్‌, డాక్టర్‌  యెల్లా వెంకటేశ్వర్‌రావు-మృదంగం, పీవీ రమణమూర్తి-ఘటం ప్రదర్శన ఉంటుంది. వీటితోపాటు ప్రతి రోజు మరికొన్ని ప్రదర్శనలుంటాయి.