లాస్‌ ఏంజెలిస్‌, జనవరి 7: గానగంధర్వుడు ఘంటసాల.. గానకోకిల పి.సుశీల ఆలపించిన పాటలు ఆతరం.. ఈతరం అనే తేడా లేకుండా అందరినీ ఉత్సాహంతో ఉర్రూతలూపుతాయి. గాయకుల గొంతుల్లోని తియ్యదనం.. పాటల్లోని భావుకత సంగీత ప్రియుల్లో ఆనందం, ఆవేశం, ఆవేదన, ఆశ్చర్యం సహా మరెన్నో భావోద్వేగాలను రగుల్చుతాయి. నవరసాలను పండిస్తాయి. రాక్‌, ఫోక్‌, జజ్‌, క్లాసికల్‌, హెవీ మెటల్‌ ఇలా ఏ సంగీత ప్రక్రియైునా.. ఏ భాషలో పాడిన పాటైనా సరే రగిల్చే భావోద్వేగం మాత్రం ఒక్కటేనని అమెరికాలోని కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. చైనా, అమెరికాల్లో 2,500 మందిని సర్వే చేసిన అనంతరం ఈవిషయాన్ని వెల్లడించారు.