చిన్ని నారాయణరావు ఫౌండేషన్‌- మల్లెతీగ సంయుక్తంగా నిర్వహించిన తెలుగు కథల పోటీలో వాసంతి (సికింద్రాబాద్‌) ‘రేవతి పెళ్ళి’ కథ రూ.8వేలు మొదటి బహుమతి గెలుచు కుంది. సృజన్‌ సన్‌ (హైదరాబాద్‌) ‘లెగసీ’ కథ రు.5వేలు, వడలి రాధాకృష్ణ (చీరాల) ‘బ్రతుకు ఆవలి జీవితాలు’ కథ రూ.3వేలు- ద్వితీయ తృతీ య బహుమతులు గెలుచుకున్నాయి. విహారి (హైదరాబాద్‌) ‘లోపలి ప్రపంచం’, సింహ ప్రసాద్‌ (హైదరాబాద్‌) ‘బిర్యాని’, బాలి (విశాఖ పట్నం) ‘నూతిలో కప్పలు’, శరత్‌ చంద్ర (హైద రాబాద్‌) ‘వెంట వచ్చునది’, బళ్ళా షణ్ముఖరావు (విశాఖపట్నం) పరిణామక్రమం, జిల్లేళ్ళ బాలాజీ (తిరుపతి) ‘మూతబడిన పార్కు’, తటవర్తి నాగే శ్వరి (కొవ్వూరు) ‘సత్యభామ’, వియోగి (కర్నూలు) ‘స్ఫూర్తి’, టి. తిప్పారెడ్డి (మదనపల్లి) ‘బోయకొండ బేరం’ కథలు రు.1000 బహుమతికి ఎంపిక య్యాయి. జ్యూరీ ప్రత్యేక బహుమతి: శైలజా మిత్ర (హైదరాబాద్‌) కథ ‘ఆడపిల్ల’. ఎంపికైంది. త్వరలో జరిగే సభలో బహుమతులు అందజేస్తాం.

కలిమిశ్రీ