హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలలో 110 రోజులలో 100 కూచిపూడి నృత్య ప్రదర్శనలు చేసిన సామల సదాశివుడు భారత్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కారని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. కూచిపూడి శాస్త్రీయ నృత్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న సదాశివుడి సంకల్పాన్ని ప్రతినిధులు డాక్టర్‌ కె.వి.రమణారావు, హనుమంతునాయుడు, తెలంగాణ రాష్ట్రపబ్లిసిటీ సెక్రటరీ నాగేంద్రనాయక్‌, సుచరిత రామానుజం అభినందించారు.