హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సౌజన్యంతో ప్రొఫెసర్‌ ప్రదీప్‌కుమార్‌ థియేటర్‌ అకాడమీ వారి ‘కొమరం భీమ్‌’ చరిత్రాత్మక నాటక ప్రదర్శన ప్రేక్షకులను మైమరపించింది. ఈ నాటకాన్ని ప్రదీప్‌కుమార్‌ రచించి దర్శకత్వం వహించి నటించారు. సిద్ధిఖి పాత్రలో ఖల్‌ నాయకుడిగానటించి ఆనాటి భూస్వాముల అరాచకాలను కళ్లకు కట్టినట్లుగా చూపారు. డాక్టర్‌ హెచ్‌కె వందన కొమరం భీమ్‌ భార్య బైకుబాయి పాత్రను చక్కటి హావభావాలతో నటించారు. మిగతా కళాకారులు పాత్రోచితంగా నటించి నాటకాన్ని రక్తికట్టించారు. ఈ కార్యక్రమానికి మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ముత్యంరెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్కియాలజీ విభాగం పూర్వ పీఠాధిపతి ప్రొఫెసర్‌ ఎస్‌ ధారేశ్వరి పాల్గొన్నారు.