విశ్వవిద్యాలయాల్లో సోమసుందర్‌ పుస్తకాలు

శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ బుద్దప్రసాద్‌ 
పిఠాపురం, నవంబరు20: ప్రముఖ కవి, విమర్శకుడు డాక్టర్‌ ఆవంత్స సోమసుందర్‌ రచించిన పుస్తకాలను అన్ని విశ్వవిద్యాలయాల్లో అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్‌ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని సూర్యరాయ విద్యానంద గ్రంథాలయ ఆవరణలో ఆదివారం రాత్రి జరిగిన డాక్టర్‌ సోమసుందర్‌ లిటరరీ ట్రస్టు 16వ పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఉత్తమ కథా పురస్కారానికి ఎంపికైన నవ్య ఎడిటర్‌ ఏవీఎస్‌ జగన్నాథశర్మ, డాక్టర్‌ ఆలూరి విజయలక్ష్మి, ఉత్తమ కవిత్వానికి ఎలనాగ, ఉత్తమ దీర్ఘకవితకు గంటేడ గౌరునాయుడు, ఉత్తమ విమర్శకు సీహెచ్‌ఎస్‌వీకే రంగారావులకు అవార్డులు అందజేశారు.