ఎన్టీఆర్‌ స్టేడియం (తెలంగాణ కళాభారతి ప్రాంగణం)లో 15 నుంచి 26 వరకు పుస్తక ప్రదర్శనలో ఉచిత వైఫై:
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ
ప్రతికూల పరిస్థితిలో హైదరాబాద్‌ 30వ జాతీయ పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నాం:
బుక్‌ ఫెయిర్‌సొసైటీ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్‌ , 290 బుక్‌ స్టాల్స్‌ ఏర్పాటు
 
 
హైదరాబాద్,ఆంధ్రజ్యోతి:హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం నుంచి ఎన్టీఆర్‌ స్టేడియంలోని తెలంగాణ కళాభారతి ప్రాంగణంలో హైదరాబాద్‌ 30వ జాతీయ పుస్తక ప్రదర్శనను ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడిహరికృష్ణ, హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు జూలూరి గౌరీశంకర్‌, కె.చంద్రమోహన్‌ తెలిపారు. 
ఎన్టీఆర్‌ స్టేడియంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బుక్‌ఫెయిర్‌ నిర్వాహకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడో సారి హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ నిర్వహిస్తున్నామని, గత సంవత్సరం పది లక్షల మంది పుస్తక ప్రియులు హాజరై విజయవంతం చేశారని తెలిపారు. ఎన్టీఆర్‌ కళాభారతి ప్రాంగణంలో హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శనను సురవరం ప్రతాపరెడ్డి ప్రాంగ ణంలో 12 రోజుల పాటు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ భాషలకు సంబంధించిన పుస్తకాల ప్రదర్శన ఉంటుందని, మొత్తం ఈ ప్రదర్శనలో 290 బుక్‌ స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ బుక్‌ఫెయిర్‌ ఉంటుందన్నారు.
 
విజయవంతం చేయాలి : గౌరీశంకర్‌ 
జూలూరి గౌరీశంకర్‌ మాట్లాడుతూ నోట్ల రద్దు నేపథ్యంలో ప్రతికూల పరిస్థితిలో హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శనను నిర్వహి స్తున్నామని, పుస్తక ప్రియులందరూ తప్పకుండా హాజరై విజయవంతం చేయాలన్నారు. తమ అదృష్టం ఏమిటంటే అన్ని రాషా్ట్రల సీఎంల కంటే పుస్తకాలు చదివే సీఎం ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్‌ అని, అందుకే ఆయన ఈ ప్రాంగణాన్ని ఉచితంగా ఇవ్వ డంతోపాటు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖతో సహకారం అందిస్తున్నారని తెలిపారు. ఈ బుక్‌ ఫెయిర్‌ తర్వాత రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఈ పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గతంలో ఎన్టీఆర్‌ స్టేడియంలో జరిగిన హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌కు 10లక్షల మంది హాజరయ్యారని, హైదరా బాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలు, తదితర 150 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పుస్తక ప్రియులం దరూ బుక్‌ఫెయిర్‌ను సందర్శించాలని అన్నారు.
 
మంత్రి ఈటలచే ప్రారంభం 
ఈ పుస్తక ప్రదర్శనను గురువారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మీనారాయణ ప్రారంభిస్తారన్నారు. 12 రోజుల పాటు జరిగే పుస్తక ప్రదర్శనలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ.రమణాచారి, ఐఏఎస్‌, ఐపీఎస్‌, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, కవులు, కళాకారులు, రచయితలు పాల్గొంటారని గౌరీశంకర్‌ తెలిపారు. సురవరం ప్రతాపరెడ్డి ప్రాంగణంలో తెలంగాణ కలం యోధుడు మఖ్దూం మొయినుద్దీన్‌ వేదికతోపాటు మహాశ్వేతాదేవి ప్రాంగణంలో గూడ అంజన్న వేదికను ఏర్పాటు చేసి సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 
విలేకరుల సమావేశంలో హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ సొసైటీ కో శాధికారి రాజేశ్వర్‌రావు, సహాయ కార్యదర్శి శోభన్‌బాబు, సభ్యుడు బ్రహ్మం, కో-ఆర్డినేటర్‌ ఖయ్యూం తదితరులు పాల్గొన్నారు. 
 
 
సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలు 
మామిడిహరికృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ర్పడిన నాటి నుంచి హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించే పుస్తక ప్రదర్శనకు గత రెండు సంవత్సరాలు శాఖపరంగా సహాయ సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. పుస్తకం ప్రచురించడం ఎంత ముఖ్యమో దానిని చదివి తెలంగాణ సంస్కృతి, అక్షరప్రేమపై పుస్తక ప్రేమికులంతా పుస్తక ప్రదర్శనకు హాజరు కావాలని అన్నారు. ఈ సారి పుస్తక ప్రదర్శనలో సాహితీ కార్యక్రమాల తోపాటు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పుస్తకాభిమానుల కోసం ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం దృష్టిలో పెట్టుకుని 12రోజులపాటు ఉచిత వైఫై కల్పిం చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 
 
12 రోజుల పాటు జరిగే కార్యక్రమాలు 
పుస్తక ప్రదర్శనలో సాహితీ కార్యక్రమాల తోపాటు సాంస్కృతిక కార్యక్రమాల వివరాలను మామిడి హరికృష్ణ వివరించారు. 15న సీహెచ్‌.రవి కుమార్‌తో ఒగ్గుడోలు, 16న రవీంద ర్‌రాజుతో కథక్‌ నృత్యం, 17న సుదీప్తపండాతో ఒడిస్సా నృత్యం 18న బి.విజయకుమార్‌తో పేరిణి నృత్యం, 19న వడ్డేపల్లి శ్రీనివాస్‌తో జానపద ఆర్కేస్ర్టా, 20న జమీలా నిషతతో మహిళా కవ్వాళి, 21న గడ్డం సమ్మయ్యతో చిందు యక్షగానం, 22న టీఎస్‌ఎస్‌.ఆర్టిస్ట్‌ బి.విద్యానంద చారితో జానపద పాటలు, 23న సర్వత ఆలీటీంతో ఫిల్మీ గజల్స్‌, 24న సుధాకర్‌, రత్నశ్రీ టీంతో కూచిపూడి నృత్యం, 25న సీహెచ్‌రవితో గుస్సాడి నృత్యం, 26న రమేష్‌తో కొమ్ము కోయ నృత్యం వంటి కార్యక్రమాల తోపాటు ఆట, పాట కార్యక్రమాలు నిర్వహి స్తామని తెలిపారు.