రచయిత శరత్‌చంద్రకూ అవార్డు ప్రదానం

విజయవాడ కల్చరల్‌, ఆంధ్రజ్యోతి: చలసాని వసుమతి మాధవ సాహితీ సేవా సంస్థ ఆధ్వర్యంలో సాహితీ పురస్కారాల ప్రదాన కార్యక్రమం ఆదివారం విజయవాడ ఫుడ్‌ ప్లాజా కాన్ఫరెన్స్‌ హాలులో నిర్వహించారు. నవ్య వీక్లీ ఎడిటర్‌ జగన్నాథశర్మ, రచయిత శరత్‌చంద్రకు శ్రీమతి చలసాని వసుమతి మాధవ సాహితీ పురస్కారాలను ముఖ్య అతిథి ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌ ప్రదానం చేశారు. దుశ్శాలువాతో సత్కరించి జ్ఞాపికతో పాటు ఒక్కొక్కరిని రూ.25వేల నగదు బహుమతితో సత్కరించారు. ఈ కార్యక్రమంలో చలసాని వసుమతి, రచయిత జి.వి.పూర్ణచంద్‌, గుత్తికొండ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.