రవీంద్రభారతి, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): రుతురాగాలు, చక్రవాకం, మొగలిరేకులు వంటి వంద సీరియల్స్‌కు సంగీత దర్శకత్వం వహించిన డాక్టర్‌ బంటి బుల్లితెర రంగానికి వచ్చి పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంగీత జీవిత రజతోత్సవం నిర్వహిస్తున్నారు. సంగమం ఆధ్వర్యంలో 5న సాయంత్రం 6గంటలకు రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్టు సంస్థ అధ్యక్షుడు సంజయ్‌కిషోర్‌ తెలిపారు. అతిథిగా ప్రముఖ గాయకుడు డాక్టర్‌ ఎస్పీ. బాలసుబ్రహ్మణ్యం, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, తనికెళ్లభరణి, నన్నపనేని రాజకుమారి, మంజులానాయుడు, బుల్లితెర నటీనటులు హాజరవుతారని తెలిపారు. బంటి స్వరపరిచిన సంగీత విభావరి ఉంటుందన్నారు.