విశాఖపట్నం, (ఆంధ్రజ్యోతి): శ్రీ వెంకటేశ్వర నాట్యమండలి, రంగసాయి నాటకసంఘం ఆధ్వర్యంలో సురభి నాటక ప్రదర్శనల్లో భాగంగా గురు వారం ప్రదర్శించిన పాతాళ భైరవి నాటకం ఆహూతులను మైమరిపించింది. నగరంలోని కళాభారతి ఆడిటోరి యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో  సెట్టింగ్‌లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కళాకారులు తమ పాత్రల కు జీవం పోశారు. చక్కని హావభావాలతో నాటకాన్ని రక్తికట్టించారు. ఫైర్‌ వర్క్స్‌, క్షణాల్లో కళ్ల ముందు ఆవిష్కృతమయ్యే సెట్టింగ్‌లకు ప్రేక్షకులు మంత్ర ముగ్ధులయ్యారు. కళాకారుల నటనాచాతుర్యాన్ని కరతాళ ధ్వనులతో అభినందించారు.