విశాఖపట్నం: రామాయణం ఎవరు రాశారంటే వాల్మీకి అని టక్కున చెపుతాం...మరి భారతం అంటే వ్యాసుడు అంటాం...భగవద్గీత...అంటే శ్రీకృష్ణుని ప్రవచనమది...కానీ ఈ మూడింటినీ తెలుగులోకి అనువదించిన రచనా సార్వభౌముడు ఎవరో తెలుసా? శతాధిక గ్రంథకర్త శ్రీపాదకృష్ణమూర్తిశాస్త్రి ఘనత ఇది. శ్రీనాధుడిలా కవిసార్వభౌముడనిపించుకున్న ఆయనకు దక్కని సత్కారం లేదు. నూటా యాభైఏళ్ల క్రితం జన్మించిన శ్రీపాద కవిరాజుగా ఘనత వహించారంటే ఆయన కీర్తికిరీటాన్నిఅంచనా వేయొచ్చు.

రచన సార్వభౌముడు కృష్ణమూర్తిశాస్త్రి

తెలుగు వాల్మీకి, వ్యాసుడు

రామాయణ, మహాభారతాలను అనువదించిందాయనే

వేదవేదాంగాలను ఔపోసనపట్టిన ఘనుడు

శతాధిక గ్రంథకర్తగాగుర్తింపు

రచయిత అనిపించుకోవడం పెద్ద కష్టం కాకపోవ చ్చు. కానీ కవిరాజుగా గుర్తింపు సాధించాలంటే వేద వేదాంగాలను ఔపోసనపట్టిన ఘనాపాటికావాలి. ఎంతో విద్వత్తు ఉంటేనే ఇది సాధ్యం. కావ్యాలు, పురాణాలు, నాటకాలు, నవలలు, ప్రబంధాలు రచించిన శతాధిక గ్రంథకర్త ఆయన. కవిసార్వభౌముడిగా అనిపించుకున్న ఆయన కనకాభిషేకం చేయించు కున్నారు. గండపెండే రాలను తొడిగించుకున్నారు. గజారోహణ సత్కారాలను అందుకున్నారు. వ్యవసాయం చేశారు. యజ్ఞాలను నిర్వ హించారు. చదరంగం ఆడేవారు. పత్రికలను నడిపారు. ఆయనే శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి. నూటా యాభైఏళ్ల క్రి తం అక్టోబర్‌ 29న ఆయనజన్మించారు. ఆయన జయం తి సందర్భంగా నగరంలోఘనంగా వేడుకలు నిర్వహిం చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కవిగా శ్రీపాద అందుకున్న బంగారు ఆభరణాలను విశాఖ మ్యూజి యంలో ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి

శ్రీపాదకృష్ణమూర్తిశాస్త్రి తూర్పుగోదావరి జిల్లా దేవర పల్లి గ్రామంలో (ఎర్రాగూడెం వద్ద) 1866 అక్టోబర్‌ 29న జన్మించారు. తండ్రి వేంకట సోమయాజులు, తల్లి వేంకటసుబ్బమ్మ. బాల్యంలో చదరంగం, గుర్రపు స్వారీ లో మేటి అనిపించుకున్నారు. పురాణాలు ఎక్కువగా వింటూ కవిత్వం రాయాలని సంకల్పిం చారు. సాహిత్య జ్ఞానం, శాస్త్రజన్య జ్ఞానాన్ని సంపాదించారు. అదేసమయంలో షోడశ కర్మాంత స్మార్తమును, చమనాంతమును, శ్రౌతమును అభ్యసించారు. పన్నెండేళ్ల వయసులో కుమార సంభవం, నైషధం వంటి గ్రంథాలను అభ్యసించిన ఆయన శ్రీనాథుడి కవిత్వాన్ని ఆదర్శంగా తీసుకుని తెలుగులో కవిత్వం రాయడం ప్రారంభించారు. పదహారవ ఏటే సత్యనారా యణోపాఖ్యాన్ని రచించారు. కాకినాడకు చెందిన నిమ్మ న జియ్యన్న ప్రోత్సాహంతో అవధానంలు కవిత్వం నందు పూర్తిగాదృష్టిసారించారు. మహాభారతాన్ని ఆయ నొక్కరే అనుబదించారు. ద్రోణపర్వంలో అభిమన్యువధ ఘట్టం రాసేటప్పుడు తన పదేళ్ల కుమారుడు మృతి చెందినప్పుడు కూడా ఆయన కలం వీడలేదు. ఆయన రాసిన ‘బొబ్బిలి యుద్ధం’ ఆంధ్రాలో ఎన్నోసార్లు ప్రద ర్శితమయింది. అవసాన దశలో రోజుకో ప్రబంధాన్ని చెప్పి ఆదర్శవంతులయ్యారు.