ఎర్రజెండా ఎత్తిన అల్లం వీరయ్య..

వెట్టిచాకిరిలో మగ్గుతున్న బడుగు, బలహీన వర్గాల పక్షాన అల్లం వీరయ్య తన కవిత్వంతో ఎర్రజెండాను ఎత్తారు. గాజులపల్లికి చెందిన వీరయ్య ప్రధానోపాధ్యాయుడిగా రిటైర్డు అయ్యారు. వీరయ్య డిగ్రీ చదివే రోజుల్లోనే ఎర్రజెండా.. ఎర్రజెండా..ఎన్నియల్లో అంటూ అభ్యుదయ గీతాన్ని రాశాడు. ఈ పాట చీమలదండు సినిమాతో బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. 12 కథల పుస్తకాలు, రచనలు వివిధ పత్రికల్లో ప్రచురిత మయ్యాయి.

సామాజిక చైతన్యమేఅల్లం నారాయణ రచనలు..

రచయితగా, జర్నలిస్టుగా పని చేస్తున్న అల్లం నారాయణ రచనలన్నీ సామాజిక చైతన్యానికి దర్పణం. గాజులపల్లిలో 1958లో జన్మించిన నారాయణ విద్యార్థి దశలోనే విప్లవోద్యమంలో పని చేసి బయటకు వచ్చి జర్నలిస్టుగా పనిచేశారు. ఆంధ్రజ్యోతిలో అసిస్టెంట్‌ ఎడి టర్‌గా, నమస్తే తెలంగాణ ఎడిటర్‌గా పనిచేశారు. జగిత్యాల పల్లె కవితా సంపుటి, యాదిమానాది దీర్ఘ కవిత, ఎన్నిల కోనల్లో, అల్లం కారం, లైఫ్‌లైఫ్‌, ప్రాణహిత కాలమ్స్‌, అయ్యంకాళిలు రచనలు చేశారు. తన సామాజిక వ్యాసాలను ప్రాణహిత పేరిట బుక్‌ ముద్రించి ఆవిష్కరించారు. సామాజిక అంశాలనే చైతన్య ప్రామాణికంగా రచన లు చేశారు.