లండన్‌: ఈ ఏడాదికి సాహిత్యంలో నోబెల్‌ పురస్కారానికి ఎంపికైన ప్రసిద్ధ పాటల రచయిత బాబ్‌ డిలన్‌ ఎట్టకేలకు దానిపై స్పందించారు. స్వీడిష్‌ అకాడమీ నిర్ణయం విన్నాక తనకు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయి, నోటమాట రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అవార్డు అద్భుతం, అనూహ్యమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పురస్కారం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని నోబెల్‌ అకాడమీ శాశ్వత కార్యదర్శి సారా డేనియ్‌సకు ఆయన ఫోన్‌లో చెప్పారు. ఈ అవార్డును స్వీకరిస్తానని అన్నారు. డిలన్‌కు ఈనెల 13న స్వీడిష్‌ అకాడమీ నోబెల్‌ పురస్కారం ప్రకటించగా, ఆయన దానిపై స్పందించకపోవడంతో అకాడమీ సభ్యులు విస్తుబోయారు. దీనిపై అకాడమీ అధికారులు పలుమార్లు ఫోన్లు చేసినా డిలన్‌ స్పందించలేదు. డిలన్‌ అహంకారి అనీ, బొత్తిగా మర్యాద లేని రచయిత అంటూ ఒక సభ్యుడు వ్యాఖ్యానించారు కూడా. అసలు డిలన్‌ పురస్కారం స్వీకరించేందుకు సుముఖంగా ఉన్నారా అని అనుమానాలు తీవ్రమైన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేసి ఊహాగానాలకు తెరదించారు. ఇదిలావుండగా, బ్రిటన్‌ డైలీ టెలిగ్రా్‌ఫకిచ్చిన ఇంటర్వ్యూలో డిలన్‌ మాట్లాడుతూ, తనకు నోబెల్‌ రావడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నారు.