సిరిసిల్ల: 2016 సంవత్సరానికిగాను, కథావిభాగంలో ‘ఆంధ్రజ్యోతి’ అనుబంధ ‘నవ్య’ వారపత్రిక సంపాదకులు ఏఎన్‌ జగన్నాథశర్మ, ప్రొఫెసర్‌ ఎంఎం వినోదినికి రంగినేని ఎల్లమ్మ జాతీయ సాహిత్య పురస్కారాలు లభించాయి. జగన్నాథశర్మ కథా సంపుటి ‘పేగు కాలిన వాసన’కి, వినోదిని కథల పుస్తకం ‘బ్లాక్‌ ఇంక్‌’కి అవార్డులు లభించాయి. శనివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఐసీ ప్రొఫెసర్‌ మాడభూషి శ్రీధర్‌ పాల్గొన్నారు.