వరంగల్‌ కల్చరల్‌(ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ కవి, కథకుడు, నవలాకారుడు, విమర్శకుడు అ యిన ఆచార్య రామా చంద్రమౌళికి పద్మభూషణ్‌ కె.అంజిరెడ్డి సాహిత్య పురస్కారం ప్ర దానం చేస్తున్నట్టు తెలంగాణ సారస్వత పరిషత్‌ ప్రధాన కార్యదర్శి జె.చెన్నయ్య ప్రకటించారు. జులై 1 తెలంగాణ సారస్వత పరిషత్‌ హాల్‌లో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించే ఈ పురస్కార ప్రదానోత్సవంలో పరిషత్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఎల్లూరి శివారెడ్డి ఆచార్య రా మాచంద్రమౌళికి పురస్కారం ప్రదానం చేస్తారు. తర్వాత ఆన్‌లైన్‌లో హాజరయ్యే సాహిత్యాభిమానుల సమక్షంలో చంద్రమౌళి ‘ఆధునిక తెలుగు కథ’ అన్న అంశంపై ప్రసంగిస్తారు.