హైదరాబాద్: దీపావళి పండుగ సందర్భంగా శనివారం సాయంత్రం మాదాపూర్‌లోని శిల్పారామంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను అలరించాయి. శిల్పారామం థియేటర్‌, ప్రభాకర్‌ శిష్యబృందం చేసిన కూచిపూడి నృత్యం అందరిని ఆకట్టుకుంది. జయము...జయము వినాయక, పుష్పాంజలి, ఇదిగే భద్రాద్రి, అదిగో అల్లదిగో, రామాయణ శబ్దం, ముద్దుగారె యశోద, అఖిలాండేశ్వరి అంశాలపై కళాకారులు చేసిన కూచిపూడి నృత్యం కళాప్రియుల హృదయాలను రంజింప చేసింది. జానపద నృత్యాలు ఏలో..ఏలో ఎన్నిఎల్లో, అమ్మలారో, బంగారు పిల్ల, ఘల్లు ఘల్లు, మా అందం చూడర మామయ్యో, గోంగూరకాడ వంటి పాటలకు కళాకారులు చేసిన ప్రదర్శనలు కనుల విందు చేశాయి.