ఆంధ్రజ్యోతి,హైదరాబాద్:గత పాలకుల నిర్లక్ష్యంవల్ల తెలంగాణ చరిత్ర మూలనపడిందని సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ అన్నారు. అద్భుతమైన చరిత్ర ఉందనడానికి ఆలేటి కంపణం పుస్తకం ఎంతో దోహదపడుతుందని అన్నారు. హైదరాబాద్‌ 30వ జాతీయ పుస్తక ప్రదర్శనలో సోమవారం రాత్రి మఖ్ధూం మొయినుద్దీన్‌ వేదికపై ప్రముఖ రచయిత హరగోపాల్‌ రచించిన ఆలేటి కంపణం పుస్తకాన్ని మామిడి హరికృష్ణ ఆవిష్కరించారు. సభకు ప్రముఖ సినీ గేయరచయిత సుద్ధాల అశోక్‌తేజ, రచయిత సుబ్బిరెడ్డి నారాయ ణరెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్‌, వేముగంటి మురళి, తిరునగరి శ్రీనివాస్‌ తదిత రులు హాజరయ్యారు. కార్యక్రమంలో పరిశోధకులు నారాయణశర్మ, బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షుడు జూలూరీ గౌరీశంకర్‌, పుస్తకాభిమానులు పాల్గొన్నారు.