‘‘రేయ్‌ రాజా! ఏడున్నర అయ్యింది. ఏంటీ మొద్దు నిద్ర’’ అని నన్ను గట్టిగా కుదిపి వెంకటరాముడు నిద్రలేపితే కపకున్న జంకాళం తీసి గట్టిగా కళ్ళు నులుముకొని వాణ్ణి చూశాను.నోట్లో బ్రష్షు, పెదాలమీదా నురగ. అపుడపడే నిద్రలేచాడనడానికి గుర్తుగా నిద్రమత్తు పూర్తిగా వదలని కళ్లు.నిద్రలేవగానే ఎవరైనా దేవుడి పటం చూస్తారు. నాకు మాత్రం ప్రతిరోజూ మా వెంకటరాముని ముఖమే దర్శనమయ్యేది.అలా కొద్దిసేపు కూర్చొని లేచి అద్దంలో చూసుకున్నాను. నిద్ర తక్కువై ఎర్రబడిన కళ్ళలో పిసురు, ఉబ్బిన బుగ్గలు, చెదిరిన క్రాపు నేను అద్దంలో చూసుకుంటుంటే-‘‘నువ్వా పెద్ద గ్లామరు బాయివిగాని ముందు నోట్లో బ్రష్‌పడనీరా’’ అని వాడు అన్నాడు.అరగంటలో నా పనులు ముగించాను.ఇద్దరం రాత్రి మిగిలిన చద్దన్నంతో టిఫిన్‌ ముగించి హాస్టలు బయటకు వస్తుంటే వాడు అన్నాడు.‘‘మెస్సు ఉంటే కనిపించదుగాని, ఇదో పెద్ద నరకంరా! ఇంకా నెలరోజులు ఎట్లా వుండాలో’’ ఇంతకు ముందు తిన్న వేరుశనగ విత్తనాల కారంపొడి ప్రభావం అని అర్థం చేసుకున్నా! వేసవి సెలవులు అయినందువల్ల యూనివర్సిటీ హాస్టలు మెస్సులు మూసివేశారు. అందువల్ల స్వయంపాకం తప్పదు. టిఫిన్‌కు బదులుగా రాత్రి చద్దన్నం, వేరుశనగ విత్తనాల కారంపొడి మధ్యాహ్నం రాత్రి భోజన సమయాల్లో యూనివర్సిటీ పక్కనున్న పల్లెనుంచి కొంతమంది పప్పూ రసం మా హాస్టళ్ళ దగ్గరకు తీసుకు వస్తారు.

ఉంటే డబ్బులు పెట్టి లేదంటే అపగా మూడు, నాలుగు రూపాయల పపగాని, రసంగాని తీసుకుంటాం.‘‘ఎపడురా ఎగ్జాము’’ అడిగాడువాడు.‘‘ఆదివారం 18వ తేది, ఇంక మూడు రోజులే ఉంది’’‘‘ఎగ్జాము హైదరాబాదులోనే కదా?’’‘‘అవును’’‘‘మరి ఛార్జీల కోసం ఆలోచించావా?’’‘‘పొలిటికల్‌ సైన్సు డిపార్టుమెంటులో కళ్లులేని అబ్బాయికి స్ర్కైబరుగా మొన్న సెకండు సెమిస్టరు ఎగ్జామ్సు రాశాను కదా! వాటి డబ్బులు దాదాపు మూడు వందలా యాభైవరకూ రావచ్చు. అయినా వాటినే నమ్ముకోకుండా చంద్రాగాడు ఊరికి పోతుంటే విషయం చెప్పి మూడు వందలు అపఅడిగాను. వాడు నిన్ననే రావల్సింది. ఈ రోజుగాని రేపుగాని రావచ్చు’’.‘‘అందుకే! నేను కూడా మనోహరుగాణ్ణి ఇందుకోసమే అడిగి వుంచాను. ఈ రోజుగాని రేపుగాని మనియార్డరు వస్తుంది ఇస్తానన్నాడు. ఒరే రాజా! నువ్వు ఎలాగైనా ఈసారి సివిల్సు కొట్టాలిరా’’ చివరి మాట వాడు ఒత్తిపలకడం తెలుస్తూనే వుంది.