‘మిన్నీ... ఇలా దామ్మా...’ ముద్దుగా పిలిచింది కమల.మిన్నీ వస్తున్న అలికిడి వినబడలేదు.‘మిన్నీ... ఎక్కడ దాక్కున్నావే... అన్నం పెట్టాను రావే... నీకిష్టమైన మాంసం కూర... వచ్చావంటే వదలవు... దా... దాద’ మళ్ళీ కొంచెం గట్టిగా పిలిచింది కమల.పెరట్లో స్వేచ్ఛగా పొర్లుతున్న మిన్నీ అనబడే ఆ పెంపుడు కుక్కకి అప్పుడు వినబడింది యజ మానురాలి పిలుపు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి అన్నం ప్లేటు మీద కలబడింది.రామారావు అదంతా చూస్తూనే వున్నాడు. అతనికి కుక్కలంటే పడదు.పెంపుడు జంతువులు అంటే ఇష్టం లేదని కాదుగానీ ఆ కుక్క మను షుల మీదకి ఎక్కడం, దాని ప్రేమను చూపించ డంలో భాగంగా నాలుకతో నాకెయ్యడం... ఇదంతా అతనికి జలదరింపుగా వుంటుంది. అలా అని కుక్కను పెంచొద్దని ఇంట్లో వాళ్ళకు చెప్పలేడు. ఎందుకంటే అతనిమాట చెల్లుబాటయ్యేది కాదు గాబట్టి! కానీ ఈసారి రామారావు ఒక్క విషయం మాత్రం భార్యకు స్పష్టం చెయ్యగలిగాడు. అదేమి టంటే కుక్కను పెంచినా గానీ తనకు మాత్రం ఆ పనులేవీ చెప్పొద్దని చెప్పేశాడు.‘ఏమండీ... రొటీన్‌ ఫుడ్‌ అది మాత్రం ఎంత కని తింటుందండీ? మార్కెట్‌లో డాగ్‌ ఫుడ్‌ అమ్ము తారట. ఒకసారి తెద్దామండీ ఇష్టంగా తింటే అప్పుడప్పుడు తెచ్చిపెట్టొచ్చు. ఏవంటారు?’ అడి గింది కమల.రామారావు ఏమీ అన్లేదు. అప్రయత్నంగా భార్య వంకే తేరిపార చూసాడు.

 ఆ కుక్కపిల్లను ఇంట్లోకి తెచ్చి సంవత్సరంపైనే అయింది. వచ్చి నప్పటి కన్నా ఇప్పుడది ఏపుగా పెరిగి నిగనిగ లాడుతూ వుందది. అబ్బాయి సంతోష్‌ వాళ్ళ స్నేహితుడి దగ్గర్నుంచి తెచ్చాడు దాన్ని. చిన్నది శృతి కూడా కుక్కపిల్లను చూసి సంబరపడింది. పిల్లలు ఇద్దరూ ముచ్చటపడ్డంతో కమల ఆ కుక్కపిల్లను పెంచుకోవడానికి ఒప్పుకుంది. ఇప్పు డైతే ఆమె వాళ్ళిద్దరి కన్నా ఎక్కువగా దానికి దగ్గరైపోయింది. కుక్కను పెంచడం స్టేటస్‌ సింబ ల్‌గా భావిస్తోంది కమల. అందువల్లనే గొలుసుకి కట్టి దాన్ని ఉదయాన్నే వాకింగ్‌కి తిప్పడం, దాని ఆలనా పాలనా చూడ్డం ఆమె కష్టంగా భావిం చడం లేదు.కమల ఆ కుక్కపిల్లకి మంచి తిండి పెట్టా లని తాపత్రయపడుతోంది. ఎంత కుక్కయితే మాత్రం అది మాత్రం మనలాంటి జీవి కాదా... దానికి మాత్రం అన్నీ తినాలని వుండదా అంటోంది. తాము ఏం వండుకున్నా దానికి పెట్టడంతో పాటు అప్పుడప్పుడు దానికోసం కేకుల్లాంటివి తెచ్చి, అది తింటుంటే చూసి మురిసిపోవడం, మటన్‌ అమ్మే సాయిబు దగ్గరకెళ్ళి మిగిలిపోయిన దుమ్ములు, తొక్కలు, ముక్కల్లాంటివన్నీ తెచ్చి ప్రత్యేకంగా వండిపెట్టడం చేస్తోంది. ఆ విషయంలో రామా రావుకి అభ్యంతర పెట్టాల్సిందేమీ కనబడలేదు కానీ... ఎంత కాదనుకున్నా అతడికో పోలిక గుర్తు కొస్తోంది... ఇబ్బందికరమైన పోలిక...!